Buggana Rajendranath Reddy: సీఎం జగన్ ఢిల్లీ పర్యటన అందుకే.. క్లారిటీ ఇచ్చిన మంత్రి బుగ్గన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Buggana Rajendranath Reddy: ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. మరికొందరు నేతలతో సమావేశం అయ్యారు.. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ పనులు, పోలవరం.. ఇతర అంశాలపై చర్చించారు. అయితే, ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు హీట్ పుట్టిస్తోన్న సమయంలో.. ఢిల్లీలో సాగుతోన్న సీఎం జగన్ పర్యటనను రాజకీయాలకు ముడిపెట్టి ఆరోపణలు, విమర్శలు గుప్పిస్తున్నాయి విపక్షాలు.. ఈ నేపథ్యంలో.. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనకు ఎటువంటి రాజకీయ ప్రాధాన్యత లేదని స్పష్టం చేశారు.
Read Also: IPL 2024: ఐపీఎల్ 2024కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఆటగాడికి గాయం!
Also Read
- Saudi Arabia: సౌదీ F-15ను కూల్చేశాం, మక్కాపై దాడి చేయలేదు.. హౌతీల సంచలన ప్రకటన..
- Hyderabad: బ్యాచిలర్లకు గుడ్ న్యూస్.. వినాయక చవితి అన్నదానాల కోసం సరికొత్త వెబ్సైట్.. పూర్తి వివరాలు ఇవే..
- UP: మొన్న గురుగ్రామ్.. ఇవాళ లక్నోలో యువతిని కారుతో ఢీకొట్టిన యువకుడు
- PM Modi: ప్రధాని మోడీ స్నేహితుడికి ఊరట.. స్థలాన్ని వదులకున్న బీజేపీ ఎమ్మెల్యే..
విభజన హామీలు, రాష్ట్ర అవసరాల కోసమే సీఎం జగన్ ఢిల్లీ వెళ్లారని తెలిపారు మంత్రి బుగ్గన.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీతో మినహా అన్ని పార్టీలతోనూ తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుందని ఎద్దేవా చేశారు.. భావ వైరుధ్యం కలిగిన పార్టీలతోనూ రెండు రెండు సార్లు కలిసిన పార్టీ.. టీడీపీ..! అదేమీ రాజకీయమో అర్థం కాదు అని దుయ్యబట్టారు. జనసేన సిద్ధాంతం ఏమిటో అర్థం కాలేదని సెటైర్లు వేసిన ఆయన.. వైఎస్సార్ ఆశయాలు, పేదల సంక్షేమమే మా విధానం.. సొంత విధానంలేకే టీడీపీ కంప్లికేట్ అవుతోందని విమర్శించారు. ఎవరి కారును వాళ్లు నడిపితే గమ్యం చేరడం ఈజీ.. కానీ, మన కారును పక్కవాళ్లు నడిపితే అభద్రత భావం ఉంటుందన్నారు. గత ప్రభుత్వంలో స్కిల్ డవలప్ మెంట్ అంటే స్కాం.. నాలుగు రోజులు శిక్షణలో ఏమి నేర్పించి వుంటారో ఇప్పటికీ అర్థం కాదని విమర్శలు గుప్పించారు ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.
తాజావార్తలు
-
Saudi Arabia: సౌదీ F-15ను కూల్చేశాం, మక్కాపై దాడి చేయలేదు.. హౌతీల సంచలన ప్రకటన..
-
Hyderabad: బ్యాచిలర్లకు గుడ్ న్యూస్.. వినాయక చవితి అన్నదానాల కోసం సరికొత్త వెబ్సైట్.. పూర్తి వివరాలు ఇవే..
-
UP: మొన్న గురుగ్రామ్.. ఇవాళ లక్నోలో యువతిని కారుతో ఢీకొట్టిన యువకుడు
-
Erravalli lands : ఎర్రవల్లి భూముల లెక్క తేల్చండి.. అధికారులకు రేవంత్ డెడ్లైన్
-
PM Modi: ప్రధాని మోడీ స్నేహితుడికి ఊరట.. స్థలాన్ని వదులకున్న బీజేపీ ఎమ్మెల్యే..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!