Erravalli lands : ఎర్రవల్లి భూముల లెక్క తేల్చండి.. అధికారులకు రేవంత్ డెడ్‌లైన్
- ఎర్రవల్లి భూములపై 30 రోజుల్లో నివేదిక
- కేసీఆర్ కుటుంబ భూములపై సీఎం కీలక వ్యాఖ్యలు
- ప్రభుత్వ భూముల వివరాలు తేల్చాలని ఆదేశం
- ఆక్రమణలపై విచారణకు రేవంత్ ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ శాసనసభ వేదికగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబానికి చెందిన భూములపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫామ్‌హౌస్ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున భూ ఆక్రమణలు జరిగాయని ఆరోపించిన సీఎం, అక్కడి ప్రభుత్వ భూములను తేల్చేందుకు అధికారులకు 30 రోజుల గడువు విధించారు. నిర్ణీత సమయంలో చర్యలు తీసుకోకపోతే సంబంధిత అధికారులు , జిల్లా మంత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కేసీఆర్ కుటుంబం వద్ద 700 ఎకరాలకు పైగా భూమి?
ఎర్రవల్లి ఫామ్‌హౌస్ పరిసరాల్లో వివాదాస్పదంగా ఉన్న భూమి దాదాపు 385 ఎకరాలు ఉందని, అసలు అక్కడ కేసీఆర్ ఆధీనంలో 700 ఎకరాలకు పైగా భూమి ఉందా లేదా అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉందన్నారు. తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమకారులకు ఎకరం భూమి కూడా లేదని, కానీ కేసీఆర్ కుటుంబం పేరుమీదే ఏకంగా 440 ఎకరాల భూమి ఎలా వచ్చిందని సీఎం ప్రశ్నించారు. అక్కడ ఉన్న ప్రభుత్వ భూమి ఎక్కడకు పోయింది? కేసీఆర్ పట్టా భూములు ఎంత? అనేది తేల్చాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఆక్రమణలకు గురైన ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుని దళితులకు పంచుతామని స్పష్టం చేశారు.
Also Read
- Vikarabad: అనంతగిరి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి
- Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
- Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
కుటుంబ సభ్యుల పేరుతో ఉన్న భూముల వివరాల వెల్లడి
సిద్దిపేట జిల్లా మార్కూక్ మండలంలో కేసీఆర్ , ఆయన కుటుంబ సభ్యుల పేరిట ఉన్న భూముల వివరాలను సీఎం సభ దృష్టికి తీసుకువచ్చారు. నిబంధనల ప్రకారం కేసీఆర్‌కు 27 ఎకరాలు ఉండాల్సి ఉండగా 67 ఎకరాలు ఉందని తెలిపారు. కేటీఆర్ కుటుంబంలో నలుగురి పేరుపై మొత్తం 123 ఎకరాల భూమి ఉందన్నారు. అందులో కేటీఆర్ ఫ్యామిలీకి 49 ఎకరాలు, ఆయన సతీమణి శైలిమ పేరు మీద 17 ఎకరాలు, కుమారుడు హిమాన్షు పేరు మీద 43 ఎకరాలు ఉన్నాయని వివరించారు. ఇక మాజీ మంత్రి హరీష్‌రావుకు 21 ఎకరాలు, ఆయన సతీమణి పేరిట 8.5 ఎకరాలు, సంతోష్ రావు కుటుంబానికి 79 ఎకరాలు (సంతోష్ పేరుపై 18.21 ఎకరాలు, ఆయన భార్యపై 7.2 ఎకరాలు) భూమి ఉందని సీఎం వెల్లడించారు.
భూముల బదిలీపై తీవ్ర ఆరోపణలు
సత్యం రామలింగరాజుకు చెందిన భూమి 2015లో కేటీఆర్ పేరుపైకి బదిలీ అయిందని, ఆ తర్వాత ఆయన భార్య శైలిమ పేరు మీదకు మారిందని సీఎం ఆరోపించారు. ఆపై 2021 జనవరిలో కేటీఆర్ అత్తగారి పేరు మీదకు సదరు భూమి బదిలీ అయిందని సభలో తెలిపారు. ఈ రకంగా జరిగిన భూ లావాదేవీలు , ప్రభుత్వ భూముల ఆక్రమణలపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.
తాజావార్తలు
-
Vikarabad: అనంతగిరి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి
-
October 15: అక్టోబర్ 15 నుంచి ఏటీఎంలలో సరికొత్త రూల్స్! ఇక ఆ చిక్కులు ఉండవు..
-
SH-93 Hindi Signboard Row: SH-93 హైవే బోర్డుపై హిందీ అక్షరాలు.. ఇద్దరు అధికారులు సస్పెండ్
-
Abhishek Sharma: పాకిస్థాన్‌కు అసలైన మొగుడు కాటేరమ్మకొడుకే.. పాక్‌పై అభిషేక్ శర్మ విధ్వంసం..!
-
Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!