NTV Telugu Site icon

Botsa Satyanarayana: చంద్రబాబు వ్యాఖ్యలకు బొత్స కౌంటర్

Minister Botsa

Minister Botsa

Botsa Satyanarayana: పచ్చ కామెర్లు ఉన్న వాడికి ఊరంతా పచ్చగా కనిపిస్తుంది అన్నట్లు ఉంది చంద్రబాబు వ్యవహారం ఉందని ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. గత ఎన్నికల్లో చంద్రబాబు ఎందుకు 23 స్థానాలకు పరిమితం అయ్యారని ఆయన వ్యాఖ్యానించారు. దశల వారీగా మద్యం నియంత్రణ చేస్తాం అన్నాం.. బెల్టు షాపులు తీస్తాం అన్నాం తీశామని మంత్రి పేర్కొన్నారు. కొత్త అమావాస్య తర్వాత, ఉగాది తర్వాత రాష్ట్రంలో టీడీపీ ఉండదని ఆరు నెలల కిందటే చెప్పాననన్నారు. చంద్రబాబు సీటుకే దిక్కు లేదన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. గతంలో చెప్పినట్లు ఇప్పుడు ఎందుకు ధైర్యంగా చెప్పటం లేదన్నారు. అంగన్వాడీ కార్యకర్తలకు గతంలో ఎప్పుడూ పెంచనంతగా ఈ ప్రభుత్వం పెంచిందన్నారు. ఏడు వేల రూపాయలకు పైగా పెంచిందని మంత్రి చెప్పారు. ఇంకా పలు ప్రయోజనాలు అందించిందన్నారు. సమస్యలు ఉంటే చర్చించాలన్నారు.

Read Also: Chandrababu: వైసీపీలో సీట్ల మార్పులు చేర్పులపై చంద్రబాబు సెటైర్లు

అంతే కానీ ఇలా ఆందోళనలు చేయటం కరెక్ట్ కాదన్నారు. ప్రభుత్వం అంటే అందరి ప్రయోజనాలు చూడాలన్నారు. నియోజకవర్గానికి వేరే ఇంఛార్జ్ పెట్టారనే ఆనం టీడీపీ వైపు వెళ్ళారని.. చంద్రబాబు అందగాడు, చూడటానికి బాగుంటాడని వెళ్ళలేదు కదా అంటూ ఎద్దేవా చేశారు. బాగా డ్యాన్స్ వేస్తాడని వెళ్ళలేదు కదా అంటూ వ్యాఖ్యానించారు. మా ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు టచ్ లో ఉన్నారు అనటం పెద్ద జోక్ అని పేర్కొన్నారు.