Site icon NTV Telugu

Botsa Satyanarayana: విశాఖ పరిపాలన రాజధానికి కట్టుబడి ఉన్నాం.. బొత్స కీలక వ్యాఖ్యలు

Botsa Satyanarayana

Botsa Satyanarayana

Botsa Satyanarayana: రాష్ట్ర విభజన తర్వాత ఉత్తరాంధ్ర, విశాఖ వనరులు, అవకాశాలను అప్పటి ప్రభుత్వం ధ్వంసం చేసిందని రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. వైజాగ్ ఎగ్జిక్యూటివ్ కేపిటల్ ఆలస్యం అయినా పరిపాలన విశాఖ నుంచే ప్రారంభిస్తామన్న ముఖ్యమంత్రి ప్రకటన ఇన్వెస్టర్లను ఆకర్షించిందని తెలిపారు. విశాఖ పరిపాలన రాజధానికి తాము కట్టుబడి ఉన్నామన్నారు. దేశంలోని ప్రముఖ నగరాలతో సమానంగా విశాఖ అభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళిక బద్ధంగా వెళుతోందన్నారు. 6మిలియన్ల ప్యాసింజర్‌ల సామర్థ్యంతో భోగాపురం ఎయిర్‌పోర్ట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. విశాఖ మెట్రో రైలు డీపీఆర్‌ రెడీ అయ్యిందని ఈ సందర్భంగా మంత్రి వెల్లడించారు. చంద్రబాబు మాదిరి గ్రాఫిక్స్ చూపించి మోసం చేసే ప్రభుత్వం మాది కాదన్నారు. అభివృద్ధి పనులపై ఇచ్చిన హామీలు అన్నీ కార్యరూపం దాల్చాయని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీలా ప్రాజెక్ట్ కంటే ముందే పబ్లిసిటీ చేసుకునే ప్రభుత్వం కాదన్నారు. విద్యాశాఖపై ఇటీవల వస్తున్న వార్తలను బొత్స ఖండించారు. పేరెంట్స్ మీట్‌కు, రాజకీయానికి సంబంధం ఏంటని ఆయన ప్రశ్నించారు. పిల్లల చదువులకు సంబంధించి తల్లిదండ్రులతో టీచర్లు సమావేశాలపై ఈసీకి ఫిర్యాదు చేసి ఆపించారని మండిపడ్డారు.

Read Also: Delhi : ఢిల్లీలో విషాదం.. కాలువలో మునిగి చనిపోయిన ముగ్గురు ఫ్రెండ్స్

స్కూళ్ళ కు రంగులు వేయడం కాదు ట్రైనింగ్, రిక్యూట్ మెంట్ అవసరం అన్న వైజాగ్ ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ కామెంట్స్ పై బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదైనా మాట్లాడేప్పుడు సహేతుక మైన ఆధారాలతో ముందుకు రావాలని సూచించారు. విశాఖ ఉక్కుపై ప్రయివేటీకరణను వ్యతిరేకించడం మా విధానమన్న ఆయన.. కూటమి కట్టిన పార్టీలు స్టీల్ ప్లాంట్ మీద బీజేపీతో ప్రకటన చేయించాలని సవాల్ విసిరారు. చంద్రబాబు అంటే మోసం, దగాకు పేటెంట్ అని.. ఆయన మాటలు ఎవ్వరూ నమ్మరన్నారు. విశాఖ విజన్ అమలు చేసి తీరుతామన్న మంత్రి..10ఏళ్ల లో రూపురేఖలు మారిపోతాయన్నారు. ఇచ్చిన హామీలు సాధ్యం కాకపోతే అన్యధా భావించవద్దని ధైర్యంగా ప్రజలకు చెప్పింది తామేనని మంత్రి స్పష్టం చేసారు. సీపీఎస్‌ రద్దులో వున్న ఈ ఇబ్బందులు చెప్పి ప్రత్యామ్నాయం చూపించామన్నారు. దశల వారీగా మద్యపాన నిషేధం అమలు చేయడం ద్వారా అలవాటు నుంచి దూరం చేస్తున్నామన్నారు. మద్యం ధరలు తగ్గిస్తామన్న చంద్రబాబు హామీని మేం వ్యతిరేకిస్తున్నాం… అదేమీ నిత్యావసర వస్తువుల జాబితాలో వున్నది కాదన్నారు. మద్యం కల్తీని నిర్దారించాల్సింది లేబోరెటరీ కానీ చంద్రబాబు కాదు.. ఆయనకు అలవాటు వుందని తాను అనుకోవడం లేదన్నారు. గతంలోనూ మద్యం తాగి చనిపోయిన ఘటనలు జరిగాయి.. అది జరిగింది కూడా కల్తీ లిక్కర్ తాగినప్పుడు జరిగిన ఘటనలేనని మంత్రి తెలిపారు. విశాఖ పరిపాలన రాజధాని అని.. ఇక్కడ నుంచే అడ్మినిస్ట్రేషన్ జరుగుతుందన్నారు. అమరావతిలో జరిగింది సామాజిక దోపిడీ అని, అక్కడ సమాజానికి అవసరమైంది ఏదీ జరగలేదని విమర్శించారు.

Read Also: Supreme Court: ఎన్నికల్లో స్వచ్ఛత ఉండాలి.. వీవీప్యాట్ కేసులో ‘సుప్రీం’ విచారణ

అమరావతిలో పెట్టుబడులు పెట్టి మోసపోయిన అందరి మద్దతు మాకే వుందన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. అప్పుల గురించి మాట్లాడుతున్న నాయకులు నాలుగు వేలు ఇస్తాం, పదివేలు ఇస్తాం.. ఇంటికి క్యారియర్లు పంపిస్తామని ఎలా హామీ ఇస్తున్నారని ప్రశ్నించారు. సంపద సృష్టిస్తామని చెబుతున్నారు వాళ్ళ దగ్గర ఏమైనా అక్షయ పాత్రలు వున్నాయా అంటూ ప్రశ్నలు గుప్పించారు. అమరావతిలో లక్ష కోట్లు పెట్టుబడి పెడితే ఇంటి పన్నులు తప్ప మరో ఆదాయం రాదన్నారు. అదే విశాఖలో 10వేల కోట్లు పెట్టుబడి పెడితే నగరం అభివృద్ధి చెందుతుందన్నారు. 175 ఎమ్మెల్యేలు, 25 ఎంపీలు వైసీపీ గెలవబోతోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈనెల 20నుంచి ఉత్తరాంధ్రలో బస్సు యాత్ర షెడ్యూల్ ప్రారంభం అవుతుందన్నారు. స్టేజీ మారితే చంద్రబాబు మాట మారుతుంది.. ఆయనకు, ఊసరవెల్లికి తేడా లేదన్నారు. రాష్ట్రంలో ఒక్క ఎఫ్‌ఐఆర్‌ కూడా లేని నాయకుణ్ణి తానేనని… 30ఏళ్ల రాజకీయాల్లో ఒక్క కేసు కూడా తన మీద లేదన్నారు. చట్ట పరిధి దాట కుండా విజయనగరం, విశాఖ, విజయవాడ, హైదరాబాద్‌లలో చాలా ఆందోళనల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నాను… ప్రమేయం లేకుండా రాజకీయ నాయుక్నే కాదు.. ఎవరినైనా ఎందుకు ఇరికిస్తారు.. దానికి ఊరు దాటి పారిపోవాలిసిన అవసరం ఏమీ వుంటుందన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ.

Exit mobile version