Site icon NTV Telugu

Botsa Satyanarayana: చంద్రబాబు ఆరోగ్యంపై ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు..

Botsa Satyanaryana

Botsa Satyanaryana

Botsa Satyanarayana: చంద్రబాబు ఆరోగ్యంపై టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తు్న్నారని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. చంద్రబాబు ఆరోగ్యంపై ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. ఎవ్వరుబడితే వారే మాట్లడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు తనకు తెలిసిన టక్కుటమారా విద్యలతో అన్నింటినీ ఇంతవరకు తప్పించుకున్నాడు.. చివరికి తనకు ఫోన్ చేసి జిమ్మిక్కులు చెయ్యాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. రాత్రి ఓ వ్యక్తి ఫోన్ చేశారని.. ఏడుస్తూ చంద్రబాబు పెద్దాయన.. తప్పుకదా అని అడిగారని మంత్రి చెప్పారు. ఆరోగ్యం బాగోలేదు అని న్యూస్‌లో చూశానని చెప్పాడని వెల్లడించిన మంత్రి.. ఏదైనా కోర్టులో చూసుకోవాలని చెప్పానని పేర్కొన్నారు. దీని ద్వారా టీడీపీ నాయకులు లబ్ధిపొందాలని చూస్తున్నారని మంత్రి విమర్శించారు. అశోక్ గజపతి రాజు వెళ్లి పరామర్శించారని.. వారు ఎంత హాయిగా నవ్వుకుంటున్నారో ఫొటోలు చూడాలన్నారు. ఎందుకు ఇలాంటి డ్రామాలు ఆడుతున్నారని ఆయన మండిపడ్డారు.

Also Read: Minister KTR: ఈనెల 16న కేసీఆర్ సమక్షంలో పొన్నాల పార్టీలో చేరుతారు.. క్లారిటీ ఇచ్చిన కేటీఆర్‌

ఆరోగ్య బాగోకపోతే కోర్టులో పిటీషన్ వెయ్యాలన్నారు. రాత్రి జరిగితే ఉదయాన్నే మీడియాకి రావడమేంటని ఆయన ప్రశ్నించారు. ఇది‌ వారి కుటుంబం సభ్యులు, నాయకులు ఆడుతున్న డ్రామా అని ఆయన ఆరోపించారు. కోర్టు అనుమతి లేకుండా జైలుకు వైద్యులు ఎందుకు వెళ్లారని ఆయన ప్రశ్నించారు. ఇది చట్టపరంగా ఫిర్యాదు చెయ్యాలా వద్దా అంటూ మంత్రి ప్రశ్నలు గుప్పించారు. వారు చేస్తున్న పనికి వేరొకరు బలికాకూడదానే విడిచిపెట్టామన్నారు.

బొత్స మాట్లాడుతూ.. ” ఈ స్కామ్ లో చంద్రబాబు తప్పు చేసారు. దీనిని మరింత రాద్దాంతం చేస్తే నష్టపోయేది టీడీపీనే. చంద్రబాబుకు ఒళ్లంతా మచ్చలే… మచ్చలేదంటారేంటి. అశోక్ గజపతి రాజు తన మచ్చని చూసుకోకుండా మామీద విమర్శిస్తున్నారు. ఇలాంటి మాటలు మాటలాడకండి.. మేము వ్యంగ్యంగా మాట్లాడుతున్నమనడం తప్పు… ఇలా ఫోన్ చేసి మాట్లాడడం వ్యంగ్యం అనాలి. వ్యవస్థలను మేనేజ్‌ చేసేది చంద్రబాబు… మేము కాదు. ఢిల్లీ నుంచి పెద్దపెద్ద లాయర్లను తీసుకొచ్చి వాదిస్తున్నారు కదా. ఎంతో మంది నాయకులు తప్పు చేసి జైలుకు వెళ్లిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి..రాజధాని తరలింపుపై ఓ కమిటీ వేశారు. ఎంత త్వరగా విశాఖకు వస్తే అంత మంచిది.” అని పేర్కొన్నారు.

Exit mobile version