Site icon NTV Telugu

Minister BC Janardhan Reddy: సంక్రాంతిలోగా రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లపై గుంతలను పూడ్చి వేస్తాం..

Bc Janardhan Reddy

Bc Janardhan Reddy

Minister BC Janardhan Reddy: సంక్రాంతిలోగా రాష్ట్రవ్యాప్తంగా రోడ్లపై గుంతలను పూడ్చి వేస్తామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. గత ప్రభుత్వం రోడ్ల పనులకు రెన్యూవల్ చేయలేదని, ప్రజలు ఇబ్బందులు పడ్డారని.. టూరిజంకు భారీ నష్టం వాటిల్లిందని మంత్రి తెలిపారు. అమరావతిలో భారీ బడ్జెట్‌తో రహదారుల నిర్మాణం చేస్తామన్నారు. ఇతర రాష్ట్రాల్లో రోడ్లపై అధ్యయనం చేశామని.. త్వరలోనే పీపీపీ మోడల్‌లో రోడ్ల నిర్మాణం చేపడుతామన్నారు.

Read Also: Kakinada Port PDS Rice: ఏపీలో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సిట్ ఏర్పాటు

గతంలో పక్క రాష్ట్రం తెలంగాణలో ఏపీ రోడ్లపై జోకులు వేసుకునే వారని మంత్రి వెల్లడించారు. గత ప్రభుత్వంలో 42 వేల కోట్లతో రహదారుల నిర్మాణం చేశామని దినపత్రికలో రాశారని, ఎక్కడ నిర్మించారో చూపించాలన్నారు. ఓర్వకల్లు అభివృద్ధికి రూ.3 వేల కోట్లు కేంద్రం నిధులు రావడం గర్వించదగ్గ విషయమన్నారు. నంద్యాల చెక్ పోస్ట్ నుంచి గార్గేయపురం వరకూ రోడ్డు పనులు పరిశీలించామన్నారు. కర్నూలు-గుంటూరు రహదారి విస్తరణ.. కర్నూలు నగర రోడ్లు వెడల్పుకు డీపీఆర్ తయారు చేయాలని అధికారులను ఆదేశించామని మంత్రి చెప్పుకొచ్చారు.

Exit mobile version