Komatireddy Venkat Reddy : రెండు నెలల్లో రీజినల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగం టెండర్ ప్రక్రియ ప్రారంభం కానుందని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. డిసెంబర్ లోపు టెండర్లు పూర్తి చేసి జనవరిలో పనులు ప్రారంభించేలా చేస్తామని చెప్పారు. శనివారం నాడు మంత్రి చిట్యాల లో మీడియాతో మాట్లాడుతూ.. 2017- 18 లో ప్రధాని మోదీ ఉత్తర భాగం రీజినల్ రింగ్ రోడ్డు కు…
Ram Mohan Naidu: భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణం శరవేగంగా జరుగుతున్నాయని కేంద్ర మంత్రి కిజరాపు రామ్మోహన్‌నాయుడు తెలిపారు. ఇప్పటివరకు మొత్తం 86 శాతం పూర్తయిందన్నారు. విమానాశ్రయ నిర్మాణ పనులను శనివారం ఆయన పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రన్ వే, ఎర్త్ వర్క్, ట్యాక్సీ స్టాండ్ 100 శాతం పనులు అయ్యాయని.. టెర్మినల్ 79, ఏటిసి 90, బిల్డింగ్స్ 62, కనెక్టింగ్ రోడ్లు 68 శాతం పూర్తయిందని వెల్లడించారు. 2026 జూన్ లో ఎయిర్ పోర్ట్…
హైదరాబాద్ నగరంలో ప్రజావసరాలకు అనుగుణంగా అనుసంధాన (లింక్) రోడ్ల నిర్మాణం చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. రాజధాని నగరంతో పాటు హెచ్ఎండీఏ పరిధిలో హైదరాబాద్ రోడ్డు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (హెచ్ఆర్‌డీసీఎల్) ఆధ్వర్యంలో చేపడుతున్న అనుసంధాన రహదారుల నిర్మాణం, విస్తరణపై ఐసీసీసీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా 49 రోడ్ల నిర్మాణం, విస్తరణపై ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. వివిధ ప్రాంతాల మధ్య అనుసంధానత పెంచడం, ప్రజలు ఎటువంటి అవాంతరాలు లేకుండా…
GHMC Tender: హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యను తగ్గించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేబీఆర్ పార్క్ చుట్టూ పెరుగుతున్న ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు జీహెచ్ఎంసీ భారీ ప్రాజెక్ట్‌ను ప్రకటించింది. ఈ ప్రాజెక్ట్ కింద ఏడు స్టీల్ బ్రిడ్జిలు, ఏడు అండర్ పాస్‌లు నిర్మించనున్నారు. మొత్తం రూ.1,090 కోట్ల అంచనా వ్యయంతో ఈ పనులను రెండు ప్యాకేజీలుగా విభజించారు. హెచ్‌సిటి (H-City) ప్రాజెక్టులలో భాగంగా నగరంలోని పలు ప్రధాన రహదారుల్లో ఫ్లై ఓవర్లు, అండర్ పాస్‌లు నిర్మాణానికి ప్రభుత్వం…
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని గ్రామాలకు రవాణా సదుపాయాలను మెరుగుపర్చేందుకు రూ.224 కోట్ల మేరకు సెంట్రల్ రోడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (CRIF) నిధులు మంజూరు చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఈ రోజు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి విజ్ఞప్తి చేశారు.
సంక్రాంతిలోగా రాష్ట్రవ్యాప్తంగా రోడ్లపై గుంతలను పూడ్చి వేస్తామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. గత ప్రభుత్వం రోడ్ల పనులకు రెన్యూవల్ చేయలేదని, ప్రజలు ఇబ్బందులు పడ్డారని.. టూరిజంకు భారీ నష్టం వాటిల్లిందని మంత్రి తెలిపారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా. ఈ నెల 20 న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి వారిని దర్శించుకుని వేములవాడ పట్టణాభివృద్ధికి వరాల జల్లు కురిపించనున్నారు. అదే రోజు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారు.