Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Minister Ambati Rambabus Counter To Chandrababus Letter

Minister Ambati Rambabu: చంద్రబాబు లేఖకు మంత్రి అంబటి రాంబాబు కౌంటర్

Published Date :October 22, 2023 , 6:40 pm
By Chandra Shekhar Pamena
Minister Ambati Rambabu: చంద్రబాబు లేఖకు మంత్రి అంబటి రాంబాబు కౌంటర్
  • Follow Us :
  • google news
  • dailyhunt

చంద్రబాబు లేఖకు మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ లేఖ రాశారు. 45 రోజుల జైలు జీవితం తర్వాత కూడా.. నాలుగైదు నిజాలు చెబుతారేమో అన్న ఆశను నిరాశగా మారుస్తూ మీరు ఉత్తరం రాశారు అంటూ సెటైర్ వేశారు. జైలు నుంచి ఈ ఉత్తరాన్ని ఎలా బయటకు పంపారన్న టెక్నికల్ డీటెయిల్స్‌లోకి, 17(ఏ) ప్రొటోకాల్స్‌లోకి నేను వెళ్లటం లేదు.. మీ పేరిట టీడీపీయే ఆ ఉత్తరం ఇచ్చింది కాబట్టి.. ఆ ఉత్తరం చదివిన తరవాత నేను మీకు బహిరంగ లేఖ రాస్తున్నాను అని ఆయన పేర్కొన్నారు. ఇందులో కొన్ని ప్రశ్నలకు లేవనెత్తుతున్నాను. అని మంత్రి అంబటి రాంబాబు చెప్పుకొచ్చారు.

Read Also: Dussehra 2023: అక్కడ రావణుడి దిష్టిబొమ్మను దహనం చేయరు.. ఎందుకో తెలుసా..?

1. మొదటి వాక్యమే మీరు జైలులో లేనని రాశారు.. కాబట్టి దయచేసి మీ న్యాయ పోరాటం మొత్తాన్ని ఆపేయండి.. క్వాష్‌ పిటిషన్లు, బెయిల్ పిటిషన్లు ఉపసంహరించుకోండి.
2. ప్రజల గుండెల్లో ఉన్నారని రాశారు. అదే నిజమైతే.. మీ పేరు చెబితే గుర్తుకు వచ్చే నాలుగు స్కీంలు దయచేసి ప్రజలకు తెలియజేయండి.
3. మీ కోసం ప్రజా చైతన్యం ఉవ్వెత్తి ఎగిసిపడుతోందని అన్నారు. ఎగిసిపడుతున్న ఆ ప్రజలు ఎవరో దయచేసి తెలియజేయండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుపేద వర్గాలను కూడా ప్రజలే అని గుర్తించండి. వారిలో ఏ ఒక్కరూ మీరు చేసిన ద్రోహాన్ని మర్చిపోలేదు.
4. మీ రాజకీయ జీవితం అంతా తెలుగు ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం సాగిందన్నారు. తెలుగు ప్రజలు అంటే… మీ ఉద్దేశంలో ఎవరు? హైదరాబాద్‌ మెట్రోలో నల్ల చొక్కాలు వేసుకున్న ఆ నలుగురునా? అమెరికాలో, బ్రిటన్‌లో, మీ దోపిడీ సొమ్ములతో స్థిరపడిన మీ బంధుగణాలా? ఎన్టీఆర్‌ను మీరు వెన్నుపోటు పొడవటంలో సహకరించిన మీ మీడియా మిత్రులా? బీజేపీలో ఉన్న మీ బంధువులా? కాంగ్రెస్‌లోకి పంపించిన మీ మనుషులా? కొద్దిమంది వామపక్షాల నాయకుల్లో ప్రవహిస్తున్న మీ పసుపు రక్తమా? ఎవరు తెలుగు ప్రజలంటే అన్నది దయచేసి తెలియజేయండి.
5. ఓటమి భయంతో మిమ్మల్ని జైలు గోడల మధ్య బంధించి ప్రజలకు దూరం చేయాలని ఎవరో అనుకుంటున్నారని రాశారు. ఒక అవినీతిపరుడ్ని కేంద్ర ఐటీ శాఖ పట్టుకుని షోకాజ్ నోటీసు ఇచ్చింది. అది మీరే. స్కిల్‌ స్కాంలో నలుగురిని ఈడీ అరెస్టు చేసింది. ఆ స్కీంలో కర్త, కర్మ, క్రియ మీరే. స్కిల్ స్కాంలో మీకు కోర్టు రిమాండ్ విధించింది. ఆ రిమాండ్‌ను హైకోర్టు, సుప్రీంకోర్టు సమర్థించాయి. మరి, ప్రజల నుంచి మిమ్మల్ని ఎవరో దూరం చేయటం ఏమిటి? 45 ఏళ్లు దొరక్కుండా తప్పించుకున్నానన్న మీ ఆత్మవిశ్వాసం, 45 ఏళ్ల మీ వ్యవస్థల మేనేజ్‌మెంట్ ఈసారి మీకు సాధ్యం కాలేదు. కాబట్టి.. దొరికిపోయిన దొంగ దేశభక్తుడ్ని అని, ప్రజాసేవకుడ్ని అని భారీ డైలాగులు చెప్పటం బాగోదు.
6. ఇక, మీ సంకెళ్లు మీ సంకల్పాన్ని బంధించలేవని జైలు గోడలు, మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీయలేవని రాశారు. మీ మీద మీకు అంత సీను ఉంటే.. మీకు అంత ధైర్యం ఉంటే.. మీ మీద అంత నమ్మకం ఉంటే.. మీ ఆదాయం ఎంత? మీ ఆస్తులు ఎంత? అన్న అంశం మీద నేను ఒక పిటిషన్ వేస్తాను. కోర్టుల్లో స్టే కోసం వెళ్లకుండా సీబీఐ విచారణకు సిద్ధపడతారా?
7. స్కిల్ స్కాంలో వేరే వ్యక్తి ఎవరో సీబీఐ విచారణ జరగాలని పిటిషన్‌ వేస్తే మీ గుడ్డలు ఎందుకు తడుస్తున్నాయి.? రాష్ట్ర ప్రభుత్వ విచారణ కక్ష సాధింపు అని మీరు అంటున్నారు. అదే నిజమైతే.. కేంద్ర ప్రభుత్వ సీబీఐ విచారణకు మీరు ఆహ్వానించాలి కదా.? మరి, రెండింటికీ గుడ్డలు తడుస్తున్నాయంటే మీరు లేఖలో రాసిన డైలాగులు అన్నీ ఆత్మవంచనతో కూడిన అబద్ధాలే కదా.?
8. ఇక, దసరాకి పూర్తి మేనిఫెస్టో విడుదల చేయలేకపోయానని మరో భారీ డైలాగు వదిలారు. 2014 మేనిఫెస్టోలో మీరు చేసిన 650 వాగ్దానాలకు, అధికారంలోకి వచ్చాక మీరు చేసిన మొదటి సంతకాలకు ఏనాడూ దిక్కూమొక్కూ లేదు. కాబట్టే.. మిమ్మల్ని ప్రజలు… మీరు కొనుగోలు చేసిన ఎమ్మెల్యేల సంఖ్యకు మీ పార్టీని పరిమితం చేశారు. ఇప్పుడు మీరు మరో మేనిఫెస్టో విడుదల చేస్తే ఎంత? చేయకపోతే ఎంత?
9. ఈ రాష్ట్రంలో ఉండని మీరు, మీ పుత్రుడు, మీ దత్తపుత్రుడు మా రాష్ట్రంలో కేవలం గెస్ట్‌లు మాత్రమే కదా. ఇది మీకు వీకెండ్ రిసార్ట్ మాత్రమే కదా.?
10. ఎప్పుడూ బయటకు రాని మీ భార్యను మీరు ప్రజల్లోకి పంపుతున్నారని అన్నారు. ఎందుకండీ.. ఆవిడను ప్రజల్లోకి పంపటం.? ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచినప్పుడే, కన్నతండ్రి పక్షాన గాక.. మీ పక్షాన ఉన్న ఆమె – ఇప్పుడు ఎన్టీఆర్‌ వారసురాలు ఎలా అవుతుంది? ఆవిడ నిజం గెలవాలి అంటూ నినాదం చేస్తే.. మొదట ఎన్టీఆర్‌ను మీరే పొడిచారన్న నిజం చెప్పి ఆ తర్వాత ఏం మాట్లాడినా ఒకరో, ఇద్దరో నమ్ముతారు.
11. నా బలం జనమే అంటూ రాశారు. ఈ మధ్య జగన్ గారి స్పీచ్‌లు బాగా చూస్తున్నారని అర్థమైంది. జగన్ గారు పొత్తుల్ని నమ్ముకోవట్లేదండీ. తాను చేసిన ఇంటింటి అభివృద్ధిని, ఇంటింటికి పంపిన రూ.2.38 లక్షల కోట్ల డీబీటీని, ఇచ్చిన 31 లక్షల ఇళ్ల పట్టాలను, కడుతున్న 22 లక్షల ఇళ్లను, గ్రామ గ్రామంలోనూ తీసుకు వచ్చిన మార్పులను చూపించి మీరే నా బలం అని ప్రజలతో ఉన్నది ఉన్నట్టు చెబుతున్నారు. మరి, మీరు… ఆయన డైలాగ్ బాగుంది కదా అని నేనూ అంటానని అదే డైలాగ్ చెబితే బాగోదేమో అన్నది ఆలోచించుకోండి!
12. ఇక, చెడు గెలిచినా నిలవదన్నారు. మంచి తాత్కాలికంగా ఓడినా కాల పరీక్షలో గెలుస్తుందని అన్నారు. జగన్ గారి విషయంలో జరిగింది అదే కదా. ఆ చెడు చేసింది మీరే కదా?

ఇక, మీ దుష్ట బృందంలో అందరికీ వయస్సు పెరిగిపోయింది. కానీ, జీవన సంధ్యా సమయంలో కూడా నిజాన్ని ఒప్పుకునే అంతరాత్మ మాత్రం ఏ ఒక్కరికీ లేదు. మీరు ఇలాంటి లేఖలు మరిన్ని రాయాలని కోరుకుంటూ మంత్రి అంబటి రాంబాబు లేఖ రాశారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Ambati Rambabu
  • Andhra Pradesh
  • chandrababu
  • tdp
  • ycp

తాజావార్తలు

  • Raakaasaa: రాకాస.. డే-1 కలెక్షన్లతో నిహారిక టీమ్ షాక్!

  • Rahul Gandhi: మోడీ ఇప్పుడు ట్రంప్ నియంత్రణలో ఉన్నారు.. కేరళ ప్రచారంలో రాహుల్ గాంధీ విసుర్లు

  • Healthy Breakfast for Diabetics: మందులు లేకుండానే షుగర్ కంట్రోల్.. పూర్వీకులు తిన్న ఈ ‘ఆహారం’ సింపుల్‌గా ఇలా చేసేయండి!

  • CM Chandrababu: అమరావతి నిర్మాణంలో రాజీ పడొద్దు.. నిర్మాణ సంస్థలకు సీఎం ఆదేశాలు!

  • Ragi Ambali: అమ్మమ్మల కాలం నాటి ఆరోగ్య రహస్యం.. హాట్ హాట్ వేసవిలో శక్తిని ఇచ్చే హెల్తీ, టేస్టీ రాగి అంబలి!

ట్రెండింగ్‌

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions