Rahul Gandhi: గణతంత్ర వేడుకల్లో లోక్‌సభ, రాజ్యసభలో ప్రతిపక్ష నేతలుగా ఉన్న కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలకు సీట్ల కేటాయింపు వివాదంగా మారింది. మూడో వరసలో వీరిద్దరికి సీట్లు కేటాయించారు. ఇలా తమ నేతలను మూడో వరసలో కూర్చోబెట్టడం ప్రోటోకాల్ ఉల్లంఘన అని పార్టీ ఆరోపిస్తోంది. తమ పాలనలో ఎల్‌కే అద్వానీకి ముందు వరస సీటు కేటాయించామని చూపుతూ ఒక ఫోటోను కాంగ్రెస్ విడుదల చేసింది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రణదీప్ సింగ్ సూర్జేవాలా…