NTV Telugu Site icon

Asaduddin Owaisi: రేవంత్ రెడ్డి సినిమా మొత్తం మా దగ్గరుందంటూ అసదుద్దీన్ ఓవైసీ ఆగ్రహం..

Asadhuddin

Asadhuddin

తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్‌ సినిమా మా దగ్గర ఉంది.. చంద్రబాబు పని అయిపోగానే కాంగ్రెస్‌ గూటికి ఆయన వచ్చి చేరారు అంటూ ఓవైసీ పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి జీవితమంతా బీజేపీ, ఆర్ఎస్ఎస్ తోనే ముడిపడి ఉందని అసదుద్దీన్ కామెంట్స్ చేశారు. దశాబ్థాల పాటు రేవంత్ రెడ్డి.. కిషన్ రెడ్డితోనే కలిసి తిరిగారని ఆయన ఆరోపించారు. ఒవైసీ కుటుంబం మహారాష్ట్ర నుంచి వచ్చిందని రేవంత్ రెడ్డి అంటున్నారు.. కానీ, తన తాత ముత్తాతలు హిందుస్తాన్‌లోనే పుట్టారని ఆయన క్లారిటీ ఇచ్చారు. నా పూర్వీకులు ఇక్కడ పుడితే నా దేశం ఇదే అనే హక్కు తనకు లేదా అని అసదుద్దీన్ ఒవైసీ అడిగారు.

Read Also: Revanth Reddy: సీఎం కేసీఆర్ కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

రాహుల్ గాంధీ అసలు ఎక్కడి నుంచి వచ్చారని అసదుద్దీన్ ఓవైసీ నిలదీశారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్న మాటలు ఆర్ఎస్ఎస్ నాలుక నుంచి వచ్చినవని అంటూ ఆయన దుయ్య బట్టారు. 1999 అసెంబ్లీ ఎన్నికల్లో కిషన్ రెడ్డితో కలిసి రేవంత్ రెడ్డి పనిచేయడాన్ని తాను చూశానని అసదుద్దీన్ ఆరోపించారు. ఆయన ముందు ఏబీవీపీలో అటు నుంచి ఆర్ఎస్ఎస్ అక్కడి నుంచి బీజేపీలోకి వెళ్లినట్టు ఆయన తెలిపారు. ఆర్ఎస్ఎస్ వాళ్లు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి దగ్గరకు వెళ్లమంటే అక్కడికి వెళ్లినట్టు తెలిపారు.. ఆయన పని అయిపోగానే కాంగ్రెస్‌లోకి వెళ్లాడని ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్ఎస్ఎస్ తో సంబంధం లేదని చార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయంలో రేవంత్ రెడ్డి ప్రమాణం చేస్తావా అని ఒవైసీ సవాల్ విసిరారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఎక్కడ పుట్టారో రేవంత్ చెప్పాలని అక్బరుద్దీన్ ప్రశ్నించారు.