Kidnap: పాకిస్థాన్ సీనియర్ మంత్రి కిడ్నాప్.. విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kidnap: పాకిస్తాన్ లో ఒక సీనియర్ మంత్రిని మిలిటెంట్లు కిడ్నాప్ చేశారు. జైళ్లో ఉన్న తమ సహచరులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాసేపైన తరువాత విడుదల చేశారు. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్(పీటీఐ)కి చెందిన సీనియర్ మంత్రి అబైదుల్లా బేగ్‌ను శనివారం మిలిటెంట్లు కిడ్నాప్ చేశారు. ఆయనతో పాటు మరో ఇద్దరు ఆయన సహచరులను కూడా తీసుకువెళ్లారు. శుక్రవారం ఈ ఘటన జరగ్గా ఉగ్రవాదులతో చర్చల అనంతరం శనివారం మంత్రి అబైదుల్లా బేగ్‌తోపాటు పర్యాటకులను విడుదల చేశారు. జైలులో ఉన్న తమ సహచరులను విడిపించాలన్న డిమాండ్‌తో కూడిన వీడియో క్లిప్‌ను ఉగ్రవాదుల చెర నుంచి విడుదలైన మంత్రి చూపించారు.
Read Also: Japan: భార్య కోసం పదేళ్లుగా సముద్రంలో వెతుకుతున్న భర్త.. దిస్ ఈజ్ రియల్ లవ్
Also Read
- Mohanlal: 'ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
- Shoaib Akhtar: ఉగ్రవాదులతో క్రికెటర్‌కి సంబంధం ఏంటి? అదీ 26/11 ముంబై, పహల్గామ్ దాడుల సూత్రధారుతో..
- Pawan Kalyan: వైసీపీకి పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.. మౌనం బలహీనత కాదు..!
- Amaravati Tension: ఉండవల్లిలో హైటెన్షన్.. వైసీపీ నేతలపై కోడిగుడ్లు, రాళ్ల దాడి
ఖైబర్ పఖ్తున్ఖ్వా- గిల్గిత్ బాల్తిస్తాన్ రోడ్డుపై వెళ్తుండగా, రోడ్డుకు అడ్డంగా వాహనాలను నిలిపిన మిలిటెంట్లు, మంత్రిని కిడ్నాప్ చేశారు. పాక్ లో నిషేధిత ఉగ్ర సంస్థ తెహ్రీక్ ఇ తాలిబన్ పాకిస్తాన్’ కమాండర్ హబీబుర్ రెహ్మాన్ ఈ కిడ్నాప్ కు పాల్పడినట్లు తేలింది. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉగ్రవాదుల చెర నుంచి విడుదలైన అనంతరం మంత్రి అబైదుల్లా బేగ్ మాట్లాడుతూ.. తాను ఇస్లామాబాద్ నుంచి గిల్గిత్ వెళ్తుండగా ఉగ్రవాదులు కిడ్నాప్ చేసినట్టు చెప్పారు. నంగా పర్బత్ ప్రాంతంలో 10 మంది పర్యాటకులను హతమార్చినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న గిల్గిత్-బాల్టిస్థాన్ మోస్ట్ వాంటెడ్ మిలిటెంట్ కమాండర్ అయిన హబీబుర్ రెహ్మాన్, అతడి అనుచరులు శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో థాక్ గ్రామంలో రహదారిని బ్లాక్ చేసి మంత్రిని కిడ్నాప్ చేశారు. రోడ్డును బ్లాక్ చేయడంతో ఇరువైపులా ప్రయాణికులు చిక్కుకుపోయి ఇబ్బంది పడ్డారు.
Read Also: Premature Births : ముందస్తు ప్రసవాలకు ఆందోళనలే కారణమా..?
నంగా పర్బత్ ప్రాంతంలో విదేశీ పర్యాటకుల హత్యతో ప్రమేయమున్న వారితో పాటు డైమర్‌లో ఇతర ఉగ్ర ఘటనల్లో పాల్గొన్న తమ సహచరులను విడిచిపెట్టాలని ఉగ్రవాదులు డిమాండ్ చేస్తున్నారు. మంత్రి ఉగ్రవాదుల చెరలో ఉన్నప్పుడు గిల్గిత్-బాల్టిస్థాన్ ప్రభుత్వ మాజీ అధికార ప్రతినిధి ఫైజుల్లా మాట్లాడుతూ.. తాను అబైదుల్లా బేగ్‌తో మాట్లాడానని, ఆయన విడుదలకు చర్చలు జరుపుతున్నామని అన్నారు. కాగా, అబైదుల్లా బేగ్ తన ఇంటికి క్షేమంగా చేరుకున్నట్టు పాకిస్థాన్ అధికారిక టీవీ చానల్ జియో టీవీ పేర్కొంది. గిల్గిత్-బాల్టిస్థాన్ ప్రాంతంలోని హుంజా నుంచి పీటీఐ తరపున బేగ్ ఎన్నికయ్యారు.
తాజావార్తలు
-
Groom Dies Before Wedding: ఏమిటి ఈ ఘోరం.. పెళ్లి జరుగుతుండగానే వరుడు..
-
Earphones: రోజూ ఇయర్‌ఫోన్స్ వాడుతున్నారా? ఎంతసేపు వింటే సురక్షితం..?
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
SlumDog Script : పూరి కథకు రాజమౌళి తండ్రి కరెక్షన్స్.. ఈ సారి ష్యూర్ షాట్ హిట్
-
Earthquake Threat: భారత్‌కు భూకంప అలర్ట్.. సైంటిస్టుల పరిశోధనలో ఏం తేలింది?
ట్రెండింగ్
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్‌తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్‌బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..
-
Pesara Laddu Recipe: ప్రోటీన్ పుష్కలంగా ఉండే ‘పెసర లడ్డూలు’.. ఇంట్లోనే సులభంగా తయారు చేయండి ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!