Raj Tarun Case : గత కొద్దిరోజులుగా ఎలక్ట్రానిక్ మీడియాలో, సోషల్ మీడియాలో వైరల్ గా మారిన విషయం ఏదైనా ఉందంటే అది హీరో రాజ్ తరుణ్, లావణ్యల ప్రేమాయణం గురించే. ఈ ఉదంతం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. నటుడు రాజ్ తరుణ్ తనను ప్రేమ పేరుతో మోసం చేశాడని లావణ్య పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టింది. తనను పెళ్లి చేసుకుని అబార్షన్ చేయించాడని లావణ్య ఆరోపించింది. దీనికి సంబంధించి సాక్ష్యాధారాలు అందించిన పోలీసులు రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రా, మాల్వీ మల్హోత్రా సోదరుడిపై కేసు నమోదు చేశారు. శుక్రవారం రాత్రి లావణ్య సూసైడ్ చేసుకుంటానని తన అడ్వకేట్‌తో చేసిన చాటింగ్ కలకలం రేపింది. తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు శుక్రవారం అర్ధరాత్రి అడ్వకేట్‌కు మెసేజ్ చేసింది. నేను ఈ లోకం నుంచి వెళ్లిపోతున్నాను అంటూ తన అడ్వకేట్‌కు చేసిన మెసేజ్ లో లావణ్య పేర్కొంది.
Read Also:Argentina: హమాస్‌ను ఉగ్రసంస్థగా ప్రకటించిన అర్జెంటీనా.. ఆర్థిక మూలాలను జప్తు చేయాలని ఆదేశం..!
తాజాగా లావణ్య ఆత్మహత్య ఎందుకు చేసుకోవాలనుకుందో కారణం వివరించింది. ఆమె మాట్లాడుతూ.. ‘రాజేష్ అనే వ్యక్తి నాకు మెసేజ్ చేశాడు. తాను ఒక అడ్వకేట్ ను అని.. నీ కేస్ నేను టేకప్ చేస్తాను అని మెసేజ్ పెట్టాడు. యాక్టింగ్ అంటే ఇష్టం ఉంటే చెప్పు.. అవకాశం ఇప్పిస్తాను అన్నాడు. అప్పటికే బాధలో ఉన్న నన్ను రాజేష్ అనే అడ్వకేట్ మరింత ఇబ్బంది పెట్టాడు. ఇక జీవితం పై విరక్తి వచ్చింది. నన్ను అడగకుండానే.. నాకు తెలియకుండానే ఉదయం డీజీపీ ఆఫీస్ కి వెళ్లి కలిశాడు. నిన్న రాత్రి ఒక్కసారిగా డిప్రెషన్ కి లోనయ్యాను. అందుకే ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నాను.’ అంటూ చెప్పుకొచ్చింది. ఈ విషయం పై రాజేష్ స్పందించారు. రాజ్, లావణ్య కేసులో డీజీపీని రాజేష్ కలిశారు. నిన్న రాత్రి ఆత్మహత్య చేసుకుంటానని లావణ్య తనకు మెసేజ్ చేసిందని చెప్పారు. లావణ్యకు రక్షణ కల్పించాలని డీజీపీని రాజేష్ కోరారు. నిన్న అర్ధరాత్రి లావణ్య కాల్ చేసి కేసుకు సంబంధించి కొన్ని ప్రశ్నలు అడిగిందన్నారు. వెంటనే 100కి డయల్ చేసి పోలీసులకు సమాచారం అందించానన్నారు. వెంటనే పోలీసులు ఆమెను రెస్క్యు చేసి కాపాడారన్నారు. లావణ్యను స్టేట్ హోమ్‌కు తరలించి.. భరోసా సెంటర్లో కౌన్సిలింగ్ ఇవ్వాలని డీజీపీని కోరానని రాజేష్ తెలిపారు.
Read Also:Lucknow News: లక్నోలో రూ.8 కోట్ల విలువైన బంగారం పట్టివేత