Microsoft Outage : ప్రపంచ వ్యాప్తంగా క్రాష్ అయిన విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్.. విమాన సేవలకు అంతరాయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Microsoft Outage : మైక్రోసాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో పెద్ద బగ్ ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ బగ్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న విండోస్ యూజర్ల సిస్టమ్ స్క్రీన్లు నీలం రంగులోకి మారుతున్నాయి. సోషల్ మీడియాలో ప్రజలు నిరంతరం ఫిర్యాదులు చేస్తున్నారు. విండోస్ సిస్టమ్‌లో బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ (BSOD) లోపం కనిపిస్తుంది. దీని కారణంగా సిస్టమ్ ఉన్నట్లుండి క్లోజ్ అవుతుంది. ఈ బగ్ కారణంగా అమెరికా, ఆస్ట్రేలియా వంటి అనేక దేశాలు ప్రభావితమయ్యాయి. దీని కారణంగా చాలా బ్యాంకుల పని నిలిచిపోయింది. మైక్రోసాఫ్ట్ ఇటీవలి క్రౌడ్‌స్ట్రైక్ అప్డేట్ తర్వాత ఈ బగ్ వచ్చిందని చెబుతున్నారు.
Read Also:Children Begging: విదేశీయుల ఆటోను వెంబడించిన భిక్షాటన చేస్తున్న చిన్నారులు..
Also Read
- Donald Trump: సుప్రీంకోర్టు తీర్పుతో ఆగని ట్రంప్.. బర్త్‌రైట్ సిటిజన్‌షిప్‌పై మరోసారి సంచలన నిర్ణయం
- Kakinada: కాలేజ్ యాజమాన్యం వేధింపులకి విద్యార్థి బలి.. మనస్దాపంతో ఉరి వేసుకుని విద్యార్ది ఆత్మహత్య.!
- Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
- Mohammed Siraj: ఆటో డ్రైవర్ కొడుకు నుంచి స్టార్ బౌరల్, డీఎస్పీ వరకు.. హైదరాబాద్ 'మియా భాయ్' సక్సెస్ స్టోరీ!
ఈ బగ్‌పై మైక్రోసాఫ్ట్ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. దీని వల్ల ఆస్ట్రేలియా యూజర్లు ఎక్కువగా ప్రభావితమయ్యారు. ఈ బగ్ హార్డ్‌వేర్‌లో ఉందా లేదా సాఫ్ట్వేర్ లో ఉందా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. ఎందుకంటే చాలా మంది వినియోగదారులు ఇటీవల కొత్త సాఫ్ట్‌వేర్‌ను ఇన్స్టాల్ చేశారని.. ఉన్న ఓఎస్ లను అప్డేట్ చేశారని చెప్పారు. ఆ తర్వాత కూడా వారికి కూడా ఈ సమస్య తలెత్తింది.
As our systems are impacted by an ongoing issue with Microsoft Azure, we are experiencing high volumes at contact centre. Please contact us only if your travel is within 24 hrs.
— IndiGo (@IndiGo6E) July 19, 2024
Read Also:Raj Tarun-Malvi Malhotra: రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా మెసేజ్ చాట్స్ లీక్.. పలుమార్లు హోటల్లో..!
మైక్రోసాఫ్ట్ సర్వర్లలో లోపం కారణంగా భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న విమానయాన సంస్థలు ప్రభావితమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విమానయాన సంస్థల సర్వర్లలో అంతరాయం కారణంగా, చాలా కంపెనీల విమానాలు టేకాఫ్ కాలేకపోయాయి. సాంకేతిక లోపాలతో విమానయాన సంస్థలు దెబ్బతిన్నాయి. ప్రయాణికులు సిడ్నీ, పెర్త్ విమానాశ్రయాలలో కూడా చెక్-ఇన్ చేయలేరు. ఫ్లైట్రాడార్ 24 ట్రాకింగ్ డేటా సిడ్నీ, మెల్బోర్న్, బ్రిస్బేన్లలో విమానాలు నిలిచిపోయినట్లు చూపిస్తుంది. గ్లోబల్ టెక్నికల్ అంతరాయంతో కొన్ని ఎయిర్‌లైన్ కార్యకలాపాలు, టెర్మినల్ సేవలపై ప్రభావం పడిందని సిడ్నీ ఎయిర్పోర్ట్ ప్రతినిధి తెలిపారు. ముంబయి, ఢిల్లీ ఎయిర్‌పోర్టుల్లో కొన్ని ఆన్లైన్ సర్వీసులు తాత్కాలికంగా అందుబాటులో ఉండవని ఆకాశ ఎయిర్‌లైన్స్ ప్రకటించింది. స్పైస్‌జెట్ సైతం ఇదేతరహా సందేశాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది
తాజావార్తలు
-
Korean Kanakaraju Day 1 Collections: వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’కు దుమ్మురేపే ఓపెనింగ్స్.. తొలిరోజే రూ.18 కోట్ల గ్రాస్!
-
Naga Vamsi: ‘ఇది అంత కలర్‌ఫుల్ ఫీల్డ్ కాదు’.. సినిమా ఇండస్ట్రీపై నాగవంశీ కామెంట్స్ వైరల్!
-
Donald Trump: సుప్రీంకోర్టు తీర్పుతో ఆగని ట్రంప్.. బర్త్‌రైట్ సిటిజన్‌షిప్‌పై మరోసారి సంచలన నిర్ణయం
-
Partition 1947: ‘పార్టిషన్ 1947’ ప్రమోషన్లో కలకలం.. యువకుడికి ప్రమాదం.. యోగిని కలిసిన సన్నీ, ప్రీతి
-
Fortune Sunflower Oil FSSAI: ఈ వంట నూనె వాడుతున్నారా?.. ఫార్చ్యూన్ సన్‌ఫ్లవర్ ఆయిల్ శాంపిల్ ల్యాబ్ పరీక్షలో విఫలం..!
ట్రెండింగ్
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!