Children Begging In Delhi video Viral: ప్రతిరోజు సోషల్ మీడియాలో చాలానే వైరల్ కంటెంట్ కనబడుతుంది. తాజాగా కొందరు విదేశీయులు భారతదేశ పర్యటనకు వచ్చారు. అయితే వారు ఢిల్లీ నగరంలో ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొన్నారు. విదేశీయులు ఢిల్లీలోని ప్రాంతాలను తిరుగుతున్న సమయంలో వారు ప్రయాణిస్తున్న ఆటోను కొందరు చిన్నారులు వెంబడించారు. అలా వెంబడించిన చిన్నారులు విదేశీయులను డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేయడం వీడియోలో గమనించవచ్చు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఓ విదేశీయుడు పోస్ట్ చేయగా అది కాస్త వైరల్ గా మారింది.
Prevention Dogs: వీధి కుక్కల బెడద అరికట్టండి.. సీఎం ఆదేశాలతో రంగంలోకి జీహెచ్‌ఎంసీ..
ఈ ఘటన భారతదేశ రాజధాని ఢిల్లీ నగరంలో చోటు చేసుకుంది. విదేశీయులు ఢిల్లీలోని కొన్ని ప్రాంతాలను చుట్టేస్తున్న సమయంలో వారు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లేందుకు ఆటోలో వెళ్తున్నారు. అయితే వారు ఆటో ఎక్కుతున్న ప్రాంతంలో కొందరు చిన్న వయసు ఉన్న అమ్మాయిలు బిక్షాటన చేస్తూ కనబడ్డారు. అయితే విదేశీయులు ఆటోలో ప్రయాణం చేయడానికి ప్రయత్నం చేస్తుండగా.. వెనకాల నుండి ఓ ఇద్దరమ్మాయిలు వారిని డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమయంలో విదేశీయులు ఆటోలో ప్రయాణం చేస్తుండగా.. ఒక అమ్మాయి వాహనం వెనకాల పరిగెత్తగా మరో బాలిక ఆటోను పట్టుకొని ప్రమాదకరమైన పరిస్థితులో వేలాడింది. దీంతో విదేశీయులు ఆ అమ్మాయిల చర్య పట్ల ఒకింత ఆందోళనకు గురయ్యారు.
Gold Rate Today: మగువలకు శుభవార్త.. వరుసగా రెండోరోజు తగ్గిన బంగారం ధరలు!
ఇక ఈ ఘటనను వీడియో రికార్డు చేస్తున్న విదేశీయుడు.. ” ఇది చాలా దారుణం.. ఏం జరుగుతుందో నమ్మలేకపోతున్నా..” అని మాట్లాడాడు. అయితే ఇలాంటి వీడియోలు ఇదివరకు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కొన్ని లెక్కల ప్రకారం ఢిల్లీలో ఏకంగా 70 వేల మంది వీధి బాలలు జీవిస్తున్నట్లు సమాచారం. అందులో సగం మంది బిక్షాటన చేస్తూ జీవనం సాగించడం ఎంతో బాధపడాల్సిన విషయమే.
Typical concern of every foreign tourist visiting Delhi, India. pic.twitter.com/l1Ihr39e1s
— Indian Tech & Infra (@IndianTechGuide) July 18, 2024