Site icon NTV Telugu

Michael Clarke: ఐపీఎల్ ఆడడంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మపై విశ్వాసం.. ధోనీపై కీలక వ్యాఖ్యలు..!

Michael Clarke

Michael Clarke

Michael Clarke: ఐపీఎల్ 2025 జూన్ 3న ముగిసింది. గ్రాండ్ ఫినాలేలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు పంజాబ్ కింగ్స్‌ను 6 పరుగుల తేడాతో ఓడించి తమ తొలి ఐపీఎల్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. రజత్ పటీదార్ నేతృత్వంలోని ఆర్సీబీ ఈ సీజన్ మొత్తంలో అద్భుత ప్రదర్శన ఇచ్చింది. ఫైనల్లోనూ అదే ఫార్మ్‌ను కొనసాగించి 18 ఏళ్ల కళను నెరవేర్చుకుంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్, కోహ్లీ తదుపరి ఐపీఎల్ సీజన్‌లోనూ ఆడుతాడన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. అతడు కోహ్లీ గురించే కాకుండా మరో రెండు స్టార్ ఆటగాళ్లపైనా ఆయన విశ్వాసం చూపించారు.

Read Also: Vangalapudi Anitha: అమరావతి ప్రజలకు జగన్, భారతీ రెడ్డి క్షమాపణ చెప్పాల్సిందే..!

ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తదుపరి ఐపీఎల్‌లో ఆడతారని భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ధోనీ ఎప్పటికీ విశేషమైన ఆటగాడు. చెన్నై ఎక్కడ ఆడినప్పటికీ, హోం గేమ్ అయినా అవే గేమ్ అయినా, ఎక్కువమంది అభిమానులు ధోనీ కోసం వస్తారు. స్పాన్సర్లు కూడా ధోనీ వల్లే ఉంటారు. అభిమానులు కూడా అంతే అని మైకేల్ క్లార్క్ ఓ క్రికెట్ పాడ్‌ కాస్ట్‌ లో పేర్కొన్నారు. అంతేకాకుండా.. ధోనీ ఆ జట్టుకు రాజులాంటివాడు. అతను ఆడుతూనే ఉండాలని వాళ్లంతా కోరుకుంటున్నారు. అతను రిటైర్ అయితే దాని ప్రభావం ఎంతగా ఉంటుందో జనాలకు అర్థం కావడం లేదు. ఇది సీఎస్‌కేకి భారీ నష్టం అవుతుందని క్లార్క్ అన్నారు.

Read Also: Janasena: మట్టి తవ్వకాలలో రెండు వర్గాలుగా విడిపోయి వీధికెక్కిన జనసేన నేతలు.. ఆపై దాడులు..!

ఇకపోతే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరూ ఇప్పటికే టెస్టు, టీ20 అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పారు. ప్రస్తుతం వారు కేవలం వన్డే క్రికెట్‌కే పరిమితమయ్యారు. 2025 ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ప్రదర్శన నిరాశపరిచింది. ఐదు టైటిళ్లను గెలుచుకున్న సీఎస్‌కే ఈసారి పాయింట్ల పట్టిక చివరిస్థానంలో నిలిచింది. 43 ఏళ్ల ధోనీ ప్రదర్శనపై కూడా క్రికెట్ విశ్లేషకులు తీవ్ర విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో అతను రిటైర్ కావాలన్న డిమాండ్లు వచ్చాయి. మొత్తంగా చూస్తే, ధోనీ, కోహ్లీ, రోహిత్ వంటి దిగ్గజ ఆటగాళ్ల రాబోయే సీజన్‌లో పాల్గొనడం లేదా అన్న దానిపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఇక మైకేల్ క్లార్క్ వ్యాఖ్యలు మాత్రం వీరిపై నమ్మకాన్ని పెంచేలా ఉన్నాయి.

Exit mobile version