APP: ఆప్‌కు మరో షాక్.. సత్యేందర్ జైన్‌పై కేంద్రం కీలక ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీలో ఆమ్ ఆద్మీకి దెబ్బ మీద దెబ్బలు తగలుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల వేళ తీవ్ర ఇక్కట్లు ఎదురవుతున్నాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఢిల్లీ లిక్కర్ కేసులో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా మరో షాక్ తగిలింది. తిహార్ జైల్లో ఉన్న ఆప్ మంత్రి సత్యేందర్ జైన్‌పై సీబీఐ దర్యాప్తునకు కేంద్రం అనుమతిచ్చింది. అవినీతి నిరోధక చట్టం కింద సీబీఐ చేత దర్యాప్తు కోరుతూ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఈ ఏడాది ఫిబ్రవరిలో చేసిన సిఫార్సులకు అనుగుణంగా దర్యాప్తునకు కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. జైల్లో తనకు రక్షణ కల్పిస్తానంటూ సత్యేందర్ జైన్ తన నుంచి బలవంతంగా రూ.10 కోట్లు వసూలు చేశారన్న ఆర్థిక నేరగాడు సుకేశ్ చంద్రశేఖర్ ఆరోపణలపై ఈ దర్యాప్తు జరగనుంది.
జైల్లో సకల సౌకర్యాలు కల్పించేందుకు గానూ గతంలో జైళ్ల శాఖ మంత్రిగా ఉన్న సత్యేందర్ జైన్ తన నుంచి రూ.10 కోట్లు బలవంతంగా తీసుకున్నారని సుకేశ్ ఆరోపించాడు. ఈ మేరకు లెఫ్టినెంట్ గవర్నర్‌కు అతడు లేఖ రాశాడు. ఈ వ్యవహారంలో జైన్ సహా తీహార్ జైలు మాజీ డీజీ సందీప్ గోయెల్ నిందితులుగా ఉన్నారు. వీరిద్దరిపై సుకేశ్.. లెఫ్టినెంట్ గవర్నర్‌కు రాసిన లేఖలో అనేక విషయాలు పేర్కొన్నాడు. ఇప్పుడు దీనిపై సీబీఐ దర్యాప్తు చేయనుంది. సత్యేంద్ర జైన్ కూడా అవినీతి కేసులో అరెస్టయి ప్రస్తుతం తీహార్ జైల్లోనే ఉన్నారు.
Also Read
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
- Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
- Flydubai Attack: ‘‘ప్రార్థన చేస్తూ వెనక నుంచి దాడి’’.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్
ఇది కూడా చదవండి: Nikhil Siddharth: టీడీపీలో చేరిన పాన్ ఇండియా హీరో అంటూ వార్తలు.. ఇంతలో ట్విస్టు!
ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఈడీ కస్టడీలో ఉన్నారు. ఇక డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ఏడాది నుంచి జైల్లో ఉన్నారు. ఇక ఇదే కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కూడా తీహార్ జైల్లో ఉన్నారు. తాజాగా గోవా ఆప్ లీడర్లకు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఇలా ఒక్కొక్కరు ఈ కేసుల్లో ఇరుక్కుంటున్నారు.
ఇది కూడా చదవండి: Rahul Gandhi: పవర్‌లోకి రాగానే వారిపై చర్యలుంటాయి
తాజావార్తలు
-
Oben Rorr EVO: 180KM రేంజ్.. 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ బైక్ ఇదే..!
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
-
WhatsApp: వాట్సాప్ లో కొత్త సెక్యూరిటీ ఫీచర్.. AI కూడా మీ చాట్ చదవలేదట! Restricted Chat ఎలా పనిచేస్తుందంటే?
-
Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!