NTV Telugu Site icon

Meta AI: భారతీయుల కోసం మెటా ఏఐ(AI )..ఎలా ఉపయోగించాలో ఇక్కడ చూడండి..

New Project (16)

New Project (16)

ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటా తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బాట్ మెటా AI సౌకర్యాన్ని భారతీయ వినియోగదారులకు పరిచయం చేయడం ప్రారంభించింది. చాలా నెలల క్రితం కంపెనీ ఈ ఏఐ చాట్‌బాట్‌ను భారతదేశంలోని కొంతమంది వినియోగదారులతో పరీక్షిస్తున్న సంగతి తెలిసిందే. మెటాకు అతిపెద్ద మార్కెట్లలో భారతదేశం ఒకటి. ఇక్కడ మెటా ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగిస్తున్న చందాదారుల సంఖ్య కోట్లలో ఉంది. మెటా ఏఐ ప్రారంభానికి ముందు, గూగుల్ ఇటీవల భారతీయ వినియోగదారుల కోసం ఏఐ చాట్‌బాట్ జెమిని మొబైల్ యాప్‌ను పరిచయం చేసింది. జెమినీ మొబైల్ యాప్‌ను గూగుల్ 9 భారతీయ భాషల్లో ప్రవేశపెట్టింది.

READ MORE: Israel: ఇజ్రాయెల్ కు ఆయుధ సరఫరా నిలిపేసిన అమెరికా..కారణం ఏంటంటే?

Meta AIని ఎలా ఉపయోగించాలి…
మెటా ఏఐ ప్రస్తుతం ఆంగ్లంలో ఉపయోగించవచ్చు. ఈ చాట్‌బాట్‌ను వాట్సప్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, మెసేంజర్ తో ఉపయోగించవచ్చు. మీరు సెర్చ్ బార్‌లో మెటా ఏఐని సెర్చ్ చేసిన వెంటనే.. చాట్ పేజీలో చాటింగ్ చేసే అవకాశం ఉంటుంది. మెటా ఏఐని చాట్ జీపీటీ (ChatGPT )మాదిరిగానే ఉపయోగించవచ్చు.

READ MORE:YS Jagan : పులివెందులలో మూడో రోజు జగన్‌ పర్యటన

మెటా యూజర్ ఏదైనా ప్రశ్నను ఆంగ్లంలో టైప్ చేసి పంపవచ్చు. దీని తర్వాత, ప్రశ్నకు ఏఐ నేరుగా సమాధానం ఇస్తుంది. చిత్రాలను కూడా రూపొందిస్తుంది. అన్ని వాట్సప్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, మెసేంజర్ యూజర్స్ కి మెటా ఏఐ ఉచితం. ఈ చాట్‌బాట్‌తో చాట్ చేయడం మెటాలోని ఏదైనా ప్లాట్‌ఫారమ్‌లో చేయవచ్చు. మంచి విషయం ఏమిటంటే, టెక్స్ట్ కాకుండా, మెటా AI నుంచి చిత్రాలను కూడా రూపొందించవచ్చు. మీకు కావలసిన ఇమేజ్ రకాన్ని వివరించడం ద్వారా చాట్‌బాట్ ద్వారా కావలసిన చిత్రాన్ని కనుగొనవచ్చు. మెటా ఏఐ చాట్‌బాట్ 12 కంటే ఎక్కువ దేశాలలో అందుబాటులో ఉంది. వీటిలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, సింగపూర్, సౌత్ ఆఫ్రికా, ఉగాండా మరియు జింబాబ్వే వంటి దేశాల పేర్లు కూడా ఉన్నాయి.