ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో మెటా (ఫేస్‌బుక్) ఏఐ కారణంగా 21 ఏళ్ల యువతి ప్రాణం రక్షించబడింది. ఆ మహిళ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. అంతకు ముందు కారణాలను ఓ వీడియో రూపంలో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
వాట్సాప్‌లోకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది. ప్రస్తుతం ఏఐ అద్భుతాలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. అన్ని రంగాల్లోనూ ఏఐని వినియోగిస్తున్నారు. సోషల్ మీడియా సంస్థలు కూడా ఏఐ టెక్నాలజీని వాడుతున్నాయి. దీనిలా భాగంగా మెటా కీలక ముందడుగు వేసింది. మెటా నేతృత్వంలో నడుస్తోన్న వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి వాటిలో ఏఐ సేవలను తీసుకొచ్చారు.
ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటా తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బాట్ మెటా AI సౌకర్యాన్ని భారతీయ వినియోగదారులకు పరిచయం చేయడం ప్రారంభించింది. చాలా నెలల క్రితం కంపెనీ ఈ ఏఐ చాట్‌బాట్‌ను భారతదేశంలోని కొంతమంది వినియోగదారులతో పరీక్షిస్తున్న సంగతి తెలిసిందే.