సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా నటిస్తున్న సినిమా గుంటూరు కారం.ఈ సినిమా ను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్నారు. గుంటూరు కారం సినిమా వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మూడవ సినిమాగా తెరకెక్కుతుంది. ఈ సినిమాను జనవరిలోనే ఎంతో గ్రాండ్ గా లాంచ్ చేశారు.కానీ అనేక కారణాల తో ఇప్పటికీ కూడా ఈ సినిమా షూటింగ్ సగం కూడా పూర్తి అవ్వలేదు.. మొదట ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా పూజా హెగ్డే ను తీసుకున్నారు.అలాగే యంగ్ బ్యూటీ శ్రీలీలను మరొక హీరోయిన్ గా తీసుకున్నారు. రీసెంట్ గా పూజా హెగ్డే ఈ సినిమా నుంచి తప్పుకుంది.అయితే ఆమె సినిమా నుండి తప్పుకోవడానికి కారణం తెలియ లేదు. అయితే గుంటూరు కారం షూట్ లేట్ అవుతుందని పూజ హెగ్డే కు డేట్స్ అడ్జస్ట్ అవ్వట్లేదని అందుకే పూజా సినిమా నుంచి తప్పుకున్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది..
అయితే పూజ హెగ్డే తప్పుకోవడంతో పూజ స్థానంలోకి శ్రీలీల ను తీసుకొని మరొక హీరోయిన్ గా హాట్ బ్యూటీ మీనాక్షి చౌదరిని తీసుకోని షూటింగ్ కూడా మొదలు పెట్టినట్లు సమాచారం. అయితే రీసెంట్ గా గుంటూరు కారం సినిమాలో తాను నటిస్తున్నట్లు మీనాక్షి చౌదరి ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచింది .తెలుగులో హిట్, ఖిలాడీ లాంటి సినిమాల్లో నటించి మెప్పించింది.ప్రస్తుతం విజయ్ ఆంటోనీతో హత్య అనే సినిమాలో కూడా నటించింది.ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తాజాగా హైదరాబాద్ లో జరిగింది.ఈ ఈవెంట్ లో మీనాక్షి చౌదరి మాట్లాడుతూ.. నేను మహేష్ బాబు గారు నటిస్తున్న గుంటూరు కారం సినిమాలో నటిస్తున్నాను.ఆయనతో కలిసి నటించాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నాను. అది ఇప్పుడు కుదిరింది.ఫస్ట్ షెడ్యూల్ షూట్ కూడా అయిపోయింది. మొదటి రోజు మహేష్ గారితో మొదటి షాట్ ఇప్పటికి కూడా మర్చిపోలేను. ఆయనతో నటించడం ఎంతో హ్యాపీగా ఉంది అని తెలిపింది.