NTV Telugu Site icon

Vishwambhara: డబ్బింగ్ ను మొదలెట్టిసిన “విశ్వంభర”..

Vishwambhara

Vishwambhara

Vishwambhara: మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న క్రేజీ సోషల్ ఫాంటసీ ఎంటర్టైనర్ ‘విశ్వంభర ” సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పనులు షెడ్యూల్ ప్రకారం జరుగుతున్నాయి. నేడు గురువారం ఉదయం మూవీ మేకర్స్ ఈ చిత్రానికి డబ్బింగ్ పనులు ప్రారంభించారు. ఈ చిత్రంలో హై ఎండ్ విఎఫ్ఎక్స్ ను వాడారు. పోస్ట్ ప్రొడక్షన్ ఫార్మాలిటీలను పూర్తి చేయడానికి తగినంత సమయం పడుతుంది. కాబట్టి.. ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఏకకాలంలో జరుగుతున్నాయి.

Bhanuprakash Reddy: అప్పుల ఊబిలోంచి అభివృద్ధి వైపు ఏపీని తీసుకెళతాం: భానుప్రకాష్ రెడ్డి

ఈ చిత్రంలో మెగా స్టార్ చిరంజీవి హనుమంతుడి గొప్ప భక్తుడిగా కనిపించనున్నారు. యాక్షన్ సన్నివేశాలు కూడా ఉత్కంఠభరితంగా ఉండబోతున్నాయి. దర్శకుడు వసిష్ఠ ఈ చిత్రంలోని ప్రతి అంశాన్ని విసువల్ వండర్ గా తెరకెక్కిస్తున్నాడు. బ్లాక్ బ్లాస్టర్ ప్రొడక్షన్ హౌస్ యువి క్రియేషన్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో ప్రముఖ సాంకేతిక నిపుణులు, అనేకమంది టాప్ నటీనటులు ఇందులో నటిస్తున్నారు. విశ్వంభర చిత్రంలో త్రిష కృష్ణన్, ఆషిక రంగనాథ్ కథానాయికలుగా నటిస్తున్నారు. అలాగే కునాల్ కపూర్ ఓ పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారు.

MLA Mahipal Reddy: మహిపాల్ రెడ్డి కి చెందిన కోటి విలువైన బంగారం స్వాధీనం చేసుకున్న ఈడీ..

విక్రమ్, వంశీ, ప్రమోద్ ఈ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ ను నిర్మిస్తున్నారు. ఇటీవల ఆస్కార్ అవార్డును గెలుచుకున్న ఎం. ఎం. కీరవాణి సంగీతం అందిస్తుండగా, ప్రముఖ లెన్స్మెన్ చోటా కె. నాయిడు సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. ‘విశ్వంభర’ 2025 జనవరి 10న విడుదల కానుంది.

Show comments