Chiranjeevi: ముస్లిం సోదరులకు మెగాస్టార్ బక్రీద్ శుభాకాంక్షలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగాస్టార్ చిరంజీవి ముస్లిం సోదరులకు ట్విటర్ వేదికగా బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. బక్రీద్ పండుగ సామరస్యాన్ని, శాంతిని, ఆనందాన్ని, ఐక్యతా స్ఫూర్తిని పెంపొందిస్తుందని ఆయన అన్నారు. కరుణ,ప్రేమ,త్యాగాలకు ప్రతీక బక్రీద్ అని ఆయన అన్నారు. అల్లా ఆశీస్సులు అందరిపైనా ఉండాలని ప్రార్థిస్తున్నానన్నారు.
మెగాస్టార్ ప్రస్తుతం మూడు సినిమాల షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. అందులో ‘గాడ్‌ఫాదర్’ ప్రస్తుతం షూటింగ్ చివరిదశలో ఉంది. మోహన్‌రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మలయాళంలోని ‘లూసీఫర్’కు రీమేక్‌గా తెరకెక్కుతోంది. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 5న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఇప్పటికే డేట్‌ను కూడా ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఇటీవలే విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. నయనతార, సత్యదేవ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ గెస్ట్‌రోల్‌లో నటిస్తున్నారు.
Also Read
- Amit Shah: 2029 ఘోర పరాజయానికి సిద్ధంగా ఉండు రాహుల్.. అమిత్ షా వార్నింగ్..
- Chandrababu-Vijay Meeting: గోదావరి–కావేరీ అనుసంధానంపై ముందడుగు..? చంద్రబాబు, విజయ్ కీలక భేటీ
- Flydubai Hijacking Caseలో బిగ్ ట్విస్ట్.. ఇద్దరు పైలట్ల అరెస్టుతో పెరిగిన ఉత్కంఠ
- Robot: షాకింగ్.. 16 ఏళ్ల బాలికపై రోబో లైంగిక వేధింపులు..
ఇక బాబీ దర్శకత్వంలో చిరంజీవి 154వ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ‘వాల్తేరు వీరయ్య’ అనే టైటిల్‌ను పరిశీలనలో ఉంచినట్లు సమాచారం. ఈ సినిమాలో చిరు అండర్‌కవర్ పోలీస్‌గా కనిపించనున్నాడు. విశాఖపట్నం నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో శృతిహాసన్ హీరోయిన్‌గా నటించనుంది. మాస్ మహారాజ రవితేజ కీలకపాత్రలో నటిస్తున్నాడు.
వీటితో పాటుగా చిరు, మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘భోళా శంకర్’ సినిమాను చేస్తున్నాడు. తమిళంలో సూపర్ హిట్టయిన ‘వేదాళం’ సినిమాకు రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. తమన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో కీర్తిసురేష్, చిరంజీవి సోదరిగా నటిస్తుంది. రాఖీపండగ సందర్భంగా విడుదలైన చిరు, కీర్తి పోస్టర్‌కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. కాగా ఈ చిత్రాన్ని ఉగాది కానుకగా వచ్చే ఏడాది ఏప్రిల్ 2న విడుదల చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారని సమాచారం.
Eid Mubarak to All! May the auspicious occasion of #EidAlAdha spread the spirit of togetherness, foster harmony, peace and happiness for all. pic.twitter.com/vk2saHKGZO
— Chiranjeevi Konidela (@KChiruTweets) July 10, 2022
తాజావార్తలు
-
Scholarships : విద్యార్థులకు గుడ్‌న్యూస్.. రూ.204 కోట్ల స్కాలర్షిప్లు విడుదల
-
Amit Shah: 2029 ఘోర పరాజయానికి సిద్ధంగా ఉండు రాహుల్.. అమిత్ షా వార్నింగ్..
-
Chandrababu-Vijay Meeting: గోదావరి–కావేరీ అనుసంధానంపై ముందడుగు..? చంద్రబాబు, విజయ్ కీలక భేటీ
-
Flydubai Hijacking Caseలో బిగ్ ట్విస్ట్.. ఇద్దరు పైలట్ల అరెస్టుతో పెరిగిన ఉత్కంఠ
-
Robot: షాకింగ్.. 16 ఏళ్ల బాలికపై రోబో లైంగిక వేధింపులు..
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!