బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు మాజీ సీఎం వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగం, సహనం.. ఈ రెండూ బక్రీద్ పండుగ ఇచ్చే సందేశాలని పేర్కొన్నారు. దైవ ప్రవక్త ఇబ్రహీం మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ బక్రీద్ పండగ జరుపుకుంటారని.. త్యాగనిరతికి బక్రీద్ పండుగ నిదర్శనమన్నారు. ధనిక, పేద అన్న తారతమ్యం లేకుండా రాగద్వేషాలకు అతీతంగా ముస్లింలందరూ భక్తిశ్రద్ధలతో చేసుకునే బక్రీద్ అని.. అల్లాహ్ ఆశీస్సులు ప్రజలందరికీ ఎల్లప్పుడూ ఉండాలని కోరారు..
ముస్లింల ప్రధాన పండగలు రంజాన్, రెండోది బక్రీద్. ఈ పండుగకు ఈద్-ఉల్-జుహా, ఈదుజ్జహా, లేక బక్రీద్ అని కూడా అంటారు. ప్రపంచంలోని ప్రతి మూలలో ఉన్న ముస్లింలు రెండవ అత్యంత పవిత్రమైన ఇస్లామిక్ పండుగ ఈద్ అల్-అధాను జరుపుకుంటున్నారు. ఈద్ అల్-అధాను ఆనందం, చాలా ఉత్సాహంతో జరుపుకుంటారు.
ఏపీలో కోవిడ్ నియంత్రణ కోసం అమలు చేస్తున్న కర్ఫ్యూ కొనసాగుతున్న దృష్ట్యా బక్రీద్ నిర్వహణకు ఆంక్షలు విధించింది ప్రభుత్వం. ఈద్గాహ్ లు, బహిరంగ ప్రదేశాల్లో ప్రార్ధనలు నిషేధిస్తున్నట్టు మైనారిటీ సంక్షేమశాఖ ప్రకటించింది. భారీ జన సమూహాలను నివారించేందుకు మసీదుల్లో మాత్రమే ప్రార్ధనలకు అనుమతినిచ్చింది. భౌతిక దూరం పాటిస్తూ.. మసీదుల్లో 50 శాతం మందికి మాత్రమే ప్రార్ధనలకు అనుమతిస్తున్నట్టు మైనారిటీ సంక్షేమశాఖ పేర్కొంది. మాస్కులు లేకుండా మసీదుల్లోకి అనుమతించవద్దని కమిటీలకు ఆదేశాలు జారీ చేశారు. మసీదు ప్రాంగణాల్లో శానిటైజర్లు,…