Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Gossips Mega 156 That Senior Beauty Who Will Act Opposite Megastar

Mega 156 : మెగాస్టార్ సరసన నటించనున్న ఆ సీనియర్ హీరోయిన్..?

Published Date :December 10, 2023 , 2:32 pm
By Murali Krishna
Mega 156 : మెగాస్టార్ సరసన నటించనున్న ఆ సీనియర్ హీరోయిన్..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

మెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాది వాల్తేరు వీరయ్య సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు..అదే జోష్ లో మెహర్ రమేష్ తెరకెక్కించిన భోళా శంకర్ సినిమాలో నటించారు. కానీ ఊహించని విధంగా భోళా శంకర్ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. దీనితో మెగాస్టార్ తన తరువాత సినిమాను యంగ్ డైరెక్టర్ తో చేస్తున్నారు. బింబిసార సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న దర్శకుడు వశిష్ఠ తో మెగాస్టార్ తన 156 వ సినిమాను చేస్తున్నారు.. మెగా 156 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా సోషియో ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతోంది. రీసెంట్ గానే ఈ సినిమా షూటింగ్ మొదలైన విషయం తెలిసిందే.టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ UV క్రియేషన్స్ పతాకంపై వంశీ,ప్రమోద్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. యాక్షన్ సీక్వెన్స్ తో ఈ మూవీ షూటింగ్ ని మొదలెట్టారు. షూటింగ్ జరుగుతుండగానే ఇటీవల తెలంగాణ ఎన్నికల్లో ఓటు వేసేందుకు చిరంజీవి విరామం తీసుకుని హైదరాబాద్ కి వచ్చారు. ఓ సరికొత్త ఊహా ప్రపంచం నేపథ్యంలో ఈ సినిమా సాగనుంది. కాగా సినిమాలో చిరంజీవి సరసన పలువురు హీరోయిన్స్ ని మేకర్స్ ఇప్పటికే పరిశీలించారు. వారిలో సీనియర్ హీరోయిన్ అనుష్క శెట్టి మెగాస్టార్ సరసన ఫిక్స్ అయినట్లు గతంలో వార్తలొచ్చాయి.

కానీ ఇప్పుడు మరో హీరోయిన్ త్రిష పేరు బయటకు వచ్చింది.ఈ సినిమా కోసం అనుష్క శెట్టి ఆశించిన స్థాయిలో బరువు తగ్గకపోవడంతో ఆ అవకాశం చెన్నై బ్యూటీ త్రిష కు దక్కినట్లు సమాచారం. త్రిష ఈ ఏడాది  పొన్నియన్ సెల్వన్ మరియు లియో వంటి సినిమాలతో పాన్ ఇండియా రేంజ్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తన సెకండ్ ఇన్నింగ్స్ లో వరుస సినిమాలు చేస్తోంది. అయితే చాలా రోజుల నుంచి టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వాలని త్రిష ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఇప్పుడు మెగాస్టార్ సినిమాతో త్రిషకి ఆ అవకాశం వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు చిరంజీవి స్వయంగా త్రిష పేరును మూవీ టీం కి రిఫర్ చేసినట్లు సమాచారం.. గతంలో చిరంజీవి, త్రిష కాంబినేషన్లో ‘స్టాలిన్’ మూవీ వచ్చిన విషయం తెలిసిందే.త్వరలోనే మేకర్స్ నుంచి ఇందుకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది. కాగా ఈ సినిమాకి ‘విశ్వంభర’ అనే టైటిల్ ని మేకర్స్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ కి ఎక్కువ ప్రాధాన్యత ఉండబోతోంది. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎం. ఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి చోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు

Also Read

  • Improve Sperm Quality: వీర్యకణాల సమస్యకు నేచురల్ సొల్యూషన్.. వీర్య నాణ్యత పెంచే ఆహారపదార్థాలు ఇవే.!
  • Grok's Reply: రాహుల్ గాంధీ పరువు తీసిన గ్రోక్.. ప్రధానిగా మోడీకి మద్దతు..
  • Priyanka Chopra: ప్రియాంక ఖాతాలో మరో గ్లోబల్ అవార్డు!
  • Donald Trump: తగ్గేదేలే.. కాల్పులతో బయపెడదాం అనుకున్నారా.? ఇరాన్‌పై విజయం సాధిస్తాం.!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • #chiranajeevi
  • #mega 156
  • #vasistaa
  • Trisha

తాజావార్తలు

  • Improve Sperm Quality: వీర్యకణాల సమస్యకు నేచురల్ సొల్యూషన్.. వీర్య నాణ్యత పెంచే ఆహారపదార్థాలు ఇవే.!

  • Grok’s Reply: రాహుల్ గాంధీ పరువు తీసిన గ్రోక్.. ప్రధానిగా మోడీకి మద్దతు..

  • Orange Cap Holders: ఐపీఎల్ చరిత్రలో అరుదైన ఘట్టం.. ఒక రోజులో పూటకో ఆరెంజ్ క్యాప్ హోల్డర్!

  • Priyanka Chopra: ప్రియాంక ఖాతాలో మరో గ్లోబల్ అవార్డు!

  • Donald Trump: తగ్గేదేలే.. కాల్పులతో బయపెడదాం అనుకున్నారా.? ఇరాన్‌పై విజయం సాధిస్తాం.!

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions