Mega 156 : ఆ ఇంట్రెస్టింగ్ టైటిల్ తో రానున్న మెగాస్టార్ మూవీ..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగాస్టార్ చిరంజీవి రీసెంట్ గా తన కొత్త మూవీ ని ప్రారంభించారు. బింబిసార వంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన యంగ్ డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వంలో చిరంజీవి నటించనున్నారు.రెండు రోజుల నుంచి ఈ చిత్రానికి సంబంధించిన ఫొటోలు, వార్తలు సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి తాజాగా పూజా కార్యక్రమాన్ని పూర్తి చేసిన చిత్రబృందం నటీనటుల ఎంపిక పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు తెగ వైరల్ అవుతున్నాయి.. ఈ చిత్రం సోషియో ఫాంటసీ చిత్రంగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మూడు లోకాల చుట్టూ తిరిగే కథ అని సమాచారం.దేవ, మానవ, పాతాళలోకాల్లో ఓ పాప చుట్టూ తిరిగే ఫాంటసీ కథ అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో వీఎఫ్‌ఎక్స్ ఎఫెక్ట్స్ కూడా భారీ స్థాయిలో ఉండనున్నట్లు సమాచారం.. అలాగే ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారట.
ఇక ఇందులో విలన్‌గా రానా దగ్గుబాటిని ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇక హీరోయిన్‌గా అనుష్క శెట్టి మరియు మృణాల్ ఠాకూర్‌ల పేర్లు ఎప్పటినుంచో వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు కీరవాణి స్వరాలు అందిస్తున్నట్లు ఇప్పటికే మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించింది.మూడు దశాబ్దాల తర్వాత క్రేజీ కాంబో రిపీట్ అవుతుంది.అలాగే ఈ సినిమా టైటిల్ విషయంలోనూ సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ చిత్రానికి ‘విశ్వంభర’ అనే టైటిల్‌ను ఖరారు చేశారని సమాచారం.శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తోన్న ‘గేమ్ ఛేంజర్’కు మొదట ఇదే పేరును పరిశీలించినట్టు అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. అయితే, ఆ కథకు విశ్వంభర సరిపోదని దాన్ని పక్కన పెట్టారు. ఇప్పుడు ఇదే టైటిల్‌ను చిరంజీవి సినిమాకు ఫిక్స్ చేసినట్లు సమాచారం. చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన అయితే రాలేదు గానీ మెగా 156 మూవీకి సంబంధించిన ఈ వార్తలు మాత్రం సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
Also Read
తాజావార్తలు
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!