దేశంలో ఎక్కువ ధనవంతులైన భారతీయ మహిళలు ఢిల్లీలో ఉన్నారని మీకు తెలుసా.. అవును ఢిల్లీ అలాంటి మహిళలకు నిలయంగా మారింది. దేశంలో ఉన్న ఇతర నగరాలకంటే ఢిల్లీలోనే రిచెస్ట్ విమెన్స్ ముగ్గురు ఉన్నారు. ఢిల్లీలో అత్యంత సంపన్న భారతీయ మహిళగా టాప్ ర్యాంక్ సాధించిన మహిళగా హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ చైర్‌పర్సన్, రోష్నీ నాడార్ మల్హోత్రా నిలిచారు. ఆమె నికర విలువ 2022 నాటికి రూ. 84,330 కోట్లు ఉన్నాయి.
Ms Dhoni: ధోనీ క్రికెట్ అకాడమీలో స్కూల్ ప్రీమియర్ లీగ్.. రిజిస్ట్రేషన్స్ షూరు..!
భారతదేశంలోని అత్యంత ధనవంతులలో ఒకరైన వ్యాపార దిగ్గజం,హెచ్‌సీఎల్ ఫౌండర్ శివ్ నాడార్ ఏకైక కుమార్తె రోష్నీ. దాదాపు రూ. 3,00,000 కోట్ల మార్కెట్ క్యాప్‌తో ఐటీ రంగంలో మూడవ అతిపెద్ద కంపెనీ హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ ఈమె నాయకత్వంలో ఉంటుంది. కంపెనీకి సంబంధించి అన్ని నిర్ణయాలకు ఆమె బాధ్యత వహిస్తుంది. రోష్నీ నాయకత్వంలోనే హెచ్‌సిఎల్ కంపెనీ రూ.13,740 కోట్ల విలువైన ఏడు ఐబీఎం ఉత్పత్తులను కొనుగోలు చేసింది. ఇది కంపెనీ చరిత్రలోనే అతిపెద్దది. దీంతో ఆమె సంపద సంవత్సరానికి 54 శాతం పెరిగింది.
Amit Shah: ఏపీజే అబ్దుల్ కలాం ఇంటికి అమిత్ షా.. పుస్తకాన్ని ఆవిష్కరించిన కేంద్ర మంత్రి
రోష్నీ నాడార్ మల్హోత్రా ఢిల్లీలో పుట్టి పెరిగారు. వసంత్ వ్యాలీ స్కూల్‌లో విధ్యనభ్యసించారు. రేడియో/టీవీ/ఫిల్మ్‌పై దృష్టి సారించిన రోష్నీ.. నార్త్‌వెస్ట్రన్ విశ్వవిద్యాలయం నుండి కమ్యూనికేషన్‌లో గ్రాడ్యుయేషన్ చేశారు. అంతేకాకుండా 1976లో ఆమె తండ్రి శివ్ నాడార్ స్థాపించిన్ హెచ్‌సీసీఎల్ అభివృద్ధికి ఆమే ప్రధాన పాత్ర పోషించారు. జూలై 2020లో తన తండ్రి వారసత్వంగా హెచ్‌సిఎల్ చైర్‌పర్సన్ బాధ్యతను తీసుకున్నారు. 2017-2018, 2019 సంవత్సరాల్లో ఫోర్బ్స్ జాబితాలో ప్రపంచంలోని 100 మంది అత్యంత శక్తివంతమైన మహిళగా రోష్నీ చోటు సంపాదించుకున్నారు.
రోష్నీ కేవలం వ్యాపారవేత్తగానే కాదు.. రోష్ని నాడార్ శివ నాడార్ ఫౌండేషన్ ట్రస్ట్ కూడా ఉంది. అంతేకాకుండా ఇండియాలోని కొన్ని ఉన్నత కళాశాలలు, పాఠశాలలను స్థాపించారు. అటు సినిమా రంగం వైపు కూడా వెళ్లారు. మల్హోత్రా వన్యప్రాణుల సంరక్షకురాలు. 2018లో బాలల చిత్రం ‘హల్కా’ ను నిర్మించారు. 2019లో “ఆన్ ది బ్రింక్” అనే టీవీ సిరీస్‌ని రూపొందించారు. దేశంలోని అత్యంత ప్రమాదకరమైన జాతుల దుస్థితిపై తీసిన సిరీస్ 2022లో ఉత్తమ భారతీయ జాతీయ చలనచిత్ర అవార్డును కూడా గెలుచుకుంది. మరోవైపు తన భర్త శిఖర్ మల్హోత్రా హెచ్‌సీఎల్ కంపెనీలు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నారు. ఈ దంపతులకు ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు.