Cinematography Bill: సినిమా చూస్తూ స్టేటస్ పెట్టడానికి వీడియో తీస్తున్నారా? దొరికితే మైండ్ బ్లాకయ్యే శిక్ష?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cinematography Bill 2023:తాజాగా సినిమాటోగ్రఫీ బిల్లును రాజ్యసభ ఆమోదించింది. సినిమాటోగ్రఫీ చట్టం-1952 అంటే 1952లో తెచ్చిన సినిమాటోగ్రఫీ చట్టానికి సవరణలు చేస్తూ తాజాగా సినిమాటోగ్రఫీ చట్ట సవరణ బిల్లు-2023ను కేంద్రం ప్రతిపాదించగా రాజ్యసభ ఆమోదించింది. ఇక సినిమాటోగ్రఫీ చట్ట సవరణ బిల్లు-2023 ద్వారా పైరసీ చేసిన సినిమాలు ఇకపై ఇంటర్నెట్‌లో కనిపించకుండా అడ్డుకట్ట వేయడానికి చర్యలు తీసుకోనున్నారు. అంతేకాదు పైరసీ చేస్తే మూడేళ్ళ జైలు శిక్షతో పాటు సదరు సినిమా నిర్మాణ వ్యయంలో 5% ఫైన్ చెల్లించేలా చట్టాన్ని బలోపేతం చేయనున్నారు. ఇక ఈ లెక్కన వాట్సాప్, ఇన్స్టా స్టేటస్ లు పెట్టడం కోసం, సోషల్ మీడియాలో లైక్స్ కోసం ఫోన్లలో రికార్డు చేస్తున్న వాళ్ళు కూడా ఇక మీదట జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు. ఇక ఈ కొత్త బిల్లులో సినిమాల అనధికారిక రికార్డింగ్ అంటే షూట్ చేయడం (సెక్షన్ 6ఏఏ), వాటి ప్రదర్శన అంటే ప్రోజెక్ట్ చేయడం లేదా ప్లే చేయడం (సెక్షన్ 6ఏబీ వంటి వాటిని నిషేధించేలా కొత్త సెక్షన్లను తీసుకొచ్చారు.
Bro Movie: బ్రో సినిమాకి త్రివిక్రమ్ కంటే ముందు అనుకున్న డైలాగ్ రైటర్ ఎవరో తెలుసా?
Also Read
- Nana Patekar Dies: బాలీవుడ్ నటుడు నానా పటేకర్ కన్నుమూత.. గోవా నివాసంలో అపస్మారక స్థితిలో..!
- NBK DADA : సెట్స్‌లో అడుగుపెట్టిన సింహం.. క్రిస్ట'మాస్' చూపించబోతున్నారు
- Drishyam 3 : దృశ్యం3తో అజయ్ దేవగన్ సాలిడ్ కంబ్యాక్.. రూ. 230 కోట్లు క్రాస్ చేసిన ఫ్యామిలీ థ్రిల్లర్
- Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
అంతేకాక సినిమాలకు సెన్సార్ బోర్డు ఇచ్చే సర్టిఫికేషన్ కాల పరిమితి ప్రస్తుతం 10 ఏళ్లుగా ఉండగా ఈ బిల్లుతో ఆ కాలపరిమితిని రద్దు చేయనున్నట్లు వెల్లడించారు అయితే ఇకపై ఈ సర్టిఫికేట్ వ్యాలిడిటీ లైఫ్ టైం ఉండనుంది. ఇక సినిమా ప్రదర్శనలకు జారీ చేసే యు, ఏ, యుఏ, ఎస్ సర్టిఫికెట్లతోపాటు యూఏ సర్టిఫికెట్‌కు అదనంగా మరిన్ని మార్పులు ఈ బిల్లులో ప్రతిపాదించగా ఆమోదం లభించింది. ప్రస్తుతం యూఏ సర్టిఫికేట్‌తో తల్లిదండ్రుల అనుమతితో 12 ఏళ్ల లోపు వారు సినిమా చూసే అవకాశం ఉండగా అందుకు మార్పులు చేస్తూ యూఏ 7+, యూఏ 13+, యూఏ 16+.. ఇలా మూడు విభాగాలుగా విభజించనున్నారని తెలుస్తోంది. ఏ, ఎస్ సర్టిఫికేట్ ఉన్న సినిమాలను టీవీలు, ఓటీటీలలో అక్కడి టెలీకాస్ట్ రూల్స్ అనుగుణంగా ప్రదర్శించేందుకు వీలుగా సెన్సార్ బోర్డు ప్రత్యేక సర్టిఫికేట్ ఇచ్చేలా మరో సవరణ కూడా చేయడం గమనార్హం. ఈ సర్టిఫికేట్ కోసం సెన్సార్ బోర్డు కొన్ని సీన్లను మార్చడం లేదా తొలగించమని ఆదేశాలు జారీ చేసేందుకు అనుమతి ఉంటుందని చట్టంలో పొందుపరిచారు.
తాజావార్తలు
-
Nana Patekar Dies: బాలీవుడ్ నటుడు నానా పటేకర్ కన్నుమూత.. గోవా నివాసంలో అపస్మారక స్థితిలో..!
-
NBK DADA : సెట్స్‌లో అడుగుపెట్టిన సింహం.. క్రిస్ట’మాస్’ చూపించబోతున్నారు
-
MG Hector Blackstorm: MG హెక్టర్ బ్లాక్‌స్టార్మ్, స్నోస్టార్మ్ ఎడిషన్స్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
ట్రెండింగ్
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!