మీర్‌పేట్ మాధవి హత్య కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది.. డీఎన్‌ఏ రిపోర్టు పోలీసుల వద్దకు చేరుకుంది.. మాధవిని తన భర్త హత్య చేసి ముక్కలుగా నరికి.. ఉడకబెట్టి ఎముకలను పొడిగా చేసి చెరువులో పారేసినట్లు తేలింది. భర్త, మాజీ ఆర్మీ అధికారి గురుమూర్తి ఎలాంటి ఆధారాలు లేకుండా జాగ్రత్తపడ్డాడు. ఇంట్లో దొరికిన టిష్యూస్ ఆధారంగా ఈ కేసులో పోలీసులు గురుమూర్తిని అరెస్ట్ చేశారు. క్లుస్ టీం ఇచ్చిన టిష్యూస్ ని డీఎన్ఏ కోసం పంపారు.
Meerpet Murder Case : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన మీర్‌పేట్ హత్య కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ హత్య కేసులో క్లూస్ టీమ్‌కి దొరికిన 2 ఆధారాలతో దర్యాప్తులో ముందుకెళ్తున్నారు పోలీసులు. గ్యాస్ స్టౌవ్‌పై శరీరానికి సంబంధించిన ఒక టిష్యూ, రక్తపు మరక లభ్యమైంది. రెండింటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపింది క్లూస్ టీమ్.. దీంతో.. గురుమూర్తి హత్య ఎలా చేశాడనే దానిపై పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. మాధవి చనిపోయిన తర్వాత డెడ్‌బాడీని బాత్రూమ్‌లోకి…