Terrorist Arrest: మేడ్చల్‌లో ఐఎస్ఐ లింకుల కలకలం.. వ్యక్తి అరెస్ట్.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Terrorist Arrest: మేడ్చల్ జిల్లాలో దేశ వ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించి సంచలన పరిణామం వెలుగులోకి వచ్చింది. పాకిస్తాన్‌కు చెందిన ఐఎస్ఐ తీవ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో జాహెద్ ఖాన్ అనే వ్యక్తిని మేడ్చల్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రస్తుతం అతడిని వివిధ కోణాల్లో విచారిస్తున్నారు.
పోలీసుల అందించిన సమాచారం ప్రకారం.. ఉత్తరప్రదేశ్ కు చెందిన జాహెద్ ఖాన్ మేడ్చల్ ప్రాంతంలోని ముబారక్ హోటల్లో పనిచేస్తున్నాడు. ఇన్స్టాగ్రామ్ ద్వారా అనుమానిత వ్యక్తులతో అతడు సంప్రదింపులు జరిపినట్లు పోలీసులు గుర్తించారు. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న పాకిస్తాన్ ఐఎస్ఐ సంస్థకు చెందిన వ్యక్తులతో సన్నిహిత సంబంధాలు కొనసాగించినట్లు అనుమానాలు ఉన్నాయి.
Also Read
- KL Rahul IPL Record: ఐపీఎల్ చరిత్రలో కేఎల్ రాహుల్ అరుదైన రికార్డు..
- Vaibhav Sooryavanshi: ముంబై మ్యాచ్‌లో వైభవ్ మ్యాజిక్.. ఖాతాలోకి మరో రికార్డు.!
- Crude Oil Prices Fall: ట్రంప్ ప్రకటనతో ముడి చమురు ధరలు పతనం.. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?
- Heatwave Workout Tips: వేసవిలో జిమ్ ప్రియులారా జాగ్రత్త..! ఈ తప్పులు చేస్తే ప్రమాదంలో పడ్డట్టే..!
నిందితుడి మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు, వాట్సాప్ చాట్లు, వాయిస్ కాల్స్‌తో పాటు ఇన్స్టాగ్రామ్ రీల్స్, స్క్రీన్షాట్లను కూడా పరిశీలిస్తున్నారు. ఆయుధాలు సమకూర్చుకునేందుకు ప్రయత్నించినట్లు సమాచారం రావడంతో దర్యాప్తును మరింత ముమ్మరం చేశారు. అదేవిధంగా జాహెద్ ఖాన్ వద్ద నుంచి రెండు నకిలీ పిస్టల్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతడు హైదరాబాద్‌లో లేదా దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఏదైనా విధ్వంసానికి ప్రణాళిక రచించాడా అనే కోణంలో కూడా విచారణ కొనసాగుతోంది.
హైదరాబాద్‌లో జాహెద్ ఖాన్‌కు ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి? అతడికి సహకరించిన వారు ఎవరైనా ఉన్నారా? అనే అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
తాజావార్తలు
-
Terrorist Arrest: మేడ్చల్‌లో ఐఎస్ఐ లింకుల కలకలం.. వ్యక్తి అరెస్ట్.!
-
KL Rahul IPL Record: ఐపీఎల్ చరిత్రలో కేఎల్ రాహుల్ అరుదైన రికార్డు..
-
Hardik Pandya: హార్దిక్‌కు అన్ని అవకాశాలు ఇచ్చాం.. మాకు తగిన శాస్తి జరిగింది.. ముంబై కోచ్ సంచలన వ్యాఖ్యలు!
-
Varanasi: జక్కన్న ప్లానింగ్ మామూలుగా లేదుగా..‘వారణాసి’ యాక్షన్ ఎపిసోడ్స్‌పై క్రేజీ బజ్
-
Kamakshi: “సెక్స్‌ను బూతులా ఎందుకు చూస్తారు?”.. కామాక్షి స్ట్రాంగ్ స్టేట్మెంట్
ట్రెండింగ్
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్‌గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!