Cricket : డొమెస్టిక్ లీగ్స్ తో.. ఐసీసీ గ్లోబల్ క్రికెట్ కు ప్రమాదం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం క్రికెట్ లో అంతర్జాతీయ మ్యాచ్ ల కంటే తీగ్ ల పేరుతో ఆయా దేశాలు నిర్వహిస్తున్న టోర్నీ మ్యాచ్ లు ఎక్కవైపోయాయి. విరివిగా పుట్టుకొస్తున్న డొమెస్టిక్ లీగ్ ల వల్ల అంతర్జాతీయ క్రికెట్ కు ప్రమాదం పొంచి ఉందని.. దానిని కాపాడుకోవాని క్రికెట్ లో చట్టాలు చేసే మెరిల్ బోన్ క్రికెట్ క్లబ్( ఎంసీసీ) వెల్లడించింది. ఇప్పటికే ఐపీఎల్,బీబీఎల్, పీఎస్ఎల్, కరీబియన్ ప్రీమియర్ లీగ్ అంటూ చాలా డొమెస్టిక్స్ లీగ్స్ ఉండగా.. కొత్తగా సౌతాఫ్రికా టీ20, ఇంటర్నేషనల్ లీగ్ టీ20 పుట్టుకొచ్చాయని.. వీటివల్ల క్రికెట్ లో సంప్రదాయ ఫార్మాట్ టెస్టు క్రికెట్ సహా అంతర్జాతీయ క్రికెట్ కు ప్రమాదం ఉందని వెల్లడించింది.
Also Read :Sumalatha: ప్రధాని మోదీకే నా ఫుల్ సపోర్ట్.. బీజేపీకి సినీనటి, ఎంపీ సుమలత మద్దతు
Also Read
- IMD Warning: ఎల్‌నినో వచ్చేసింది.. మాన్సూన్పై ఐఎండీ వార్నింగ్
- Sajjala Ramakrishna Reddy: రెండేళ్ల పాలనపై ప్రజల ఆగ్రహం బయటపడింది.. చంద్రబాబుకు ఇదే లాస్ట్ టర్మ్..!
- Iran-US: ఇరాన్ మళ్లీ కొత్త మెలిక.. హార్ముజ్, యురేనియంపై కీలక వ్యాఖ్యలు
- Clothes Drying Tips: వర్షాకాలంలో బట్టలు ఆరబెట్టడానికి కష్టపడుతున్నారా? ఈ సులభమైన చిట్కాలతో గంటల్లోనే డ్రై..!
అంతేకాదు ఈ లీగ్ ల వల్ల ఐసీసీ నిర్వహిస్తున్న ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్స్ పై ఎఫెక్ట్ పడుతుందని తెలిపింది. ఈ లీగ్ ల్లో అగ్రభాగం భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ లకే చెందినవే ఉన్నాయని ఆయా దేశాల్లో ఇది పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు.. కానీ డొమెస్టిక్ లీగ్స్ వల్ల ఐసీసీలో భాగమైన అసోసియేట్ దేశాలు సహా అఫ్గానిస్థాన్, ఐర్లాండ్, జింబాబ్వే లాంటి చిన్న జట్లు నష్టపోతున్నాయని తెలిపింది. దుబాయ్ వేదికగా వరల్డ్ క్రికెట్ కమిటీ(WCC)తో ఎంసీసీ భేటీ అయింది. చర్చలో భాగంగానే డొమెస్టిక్ లీగ్ లను కట్టడి చేస్తే మంచిదని అభిప్రాయపడింది.
Also Read : Dangerous Virus: భారత్‌లో ఇన్‌ఫ్లూయెంజా పంజా.. H3N2 వైరస్‌తో ఇద్దరు మృతి
2023 నుంచి 2027 వరకు ఐసీసీ ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్ పేరుతో షెడ్యూల్ ను రూపొందించింది. అంతర్జాతీయ క్రికెట్ తోనే బిజీగా గడిపే క్రికెటర్లు.. ఆయా లీగ్స్ ఆడుతూ గాయాల పాలయ్యి కీలక సమయాల్లో జట్టుకు దూరమవుతున్నారని తెలిపింది. అందుకు ఉదహరణగా పాకిస్తాన్ ప్లేయర్ షాహిన్ అఫ్రిది, ఇండియా బౌలర్ జస్ ప్రీత్ బుమ్రా లాంటి క్రికెటర్లే అంటూ ఎంసీసీ పేర్కొంది. ఈ ట్రెండ్ ఇలానే కంటిన్యూ అవుతుంది. దీనివల్ల అంతర్జాతీయ క్రికెట్ కు, డొమిస్టిక్ లీగ్ క్రికెట్ మధ్య ఓవర్ లాప్ ఏర్పాడి సమస్య మొదలవుతుందని వివరించింది.
ఈ ఏడాదిలో ఒక్క అక్టోబర్-నవంబర్ నెలలు మాత్రమే గ్యాప్ ఏర్పడిందని.. ఆ గ్యాప్ కు కారణం కూడా ఐసీసీ వన్డే ప్రపంపకప్ నిర్వహించనుండడమే.ఈ సమయంలో అన్ని దేశాలు తమ అత్యున్నత జట్లతో బరిలోకి దిగుతాయి కాబట్టి ఎలాంటి డొమెస్టిక్ లీగ్స్ కు ఆస్కారం ఉండదని తెలిపింది. మెన్స్ క్రికెట్ లో మాత్రమే ఇలా ఉందని మహిళల క్రికెట్ లో ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్ ను రూపొందించింది. అయితే ఇప్పడిప్పుడే మహిళల క్రికెట్ లో విరివిగా డొమెస్టిక్ లీగ్ లు పుట్టుకొస్తున్నాయి. అందుకే ముందస్తు జాగ్రత్తగా డొమెస్టిక్ లీగ్ లతో ఐసీసీ గ్లోబల్ క్రికెట్ కు ముప్పు వాటిల్లకుండా బ్యాలెన్సింగ్ చేసుకోవాలని ఎంసీసీ.. వరల్డ్ క్రికెట్ కమిటీ(WCC)ని అర్జించింది.
తాజావార్తలు
-
IMD Warning: ఎల్‌నినో వచ్చేసింది.. మాన్సూన్పై ఐఎండీ వార్నింగ్
-
Sajjala Ramakrishna Reddy: రెండేళ్ల పాలనపై ప్రజల ఆగ్రహం బయటపడింది.. చంద్రబాబుకు ఇదే లాస్ట్ టర్మ్..!
-
Iran-US: ఇరాన్ మళ్లీ కొత్త మెలిక.. హార్ముజ్, యురేనియంపై కీలక వ్యాఖ్యలు
-
Sejal Pawar: డాక్టర్ అని చెప్పుకుంటూ చెత్త కూతలు కూసిన సెజల్ పవార్! అసలు రంగు బయటపెట్టిన కేఈఎమ్ హాస్పిటల్..
-
Clothes Drying Tips: వర్షాకాలంలో బట్టలు ఆరబెట్టడానికి కష్టపడుతున్నారా? ఈ సులభమైన చిట్కాలతో గంటల్లోనే డ్రై..!
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్‌ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!