NTV Telugu Site icon

AUS vs NED: మ్యాక్స్‌వెల్‌ ఊచకోత.. నెదర్లాండ్స్‌పై ఆసీస్ భారీ స్కోరు

Aus Vs Ned

Aus Vs Ned

AUS vs NED: 2023 ప్రపంచకప్‌లో ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఆస్ట్రేలియా నెదర్లాండ్స్‌ మ్యాచ్‌లో ఆసీస్‌ విధ్వంసం సృష్టించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా జట్టు.. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 399 పరుగులు చేసింది. ఆసీస్‌ స్టార్‌ బ్యాటర్లు డేవిడ్‌ వార్నర్‌(104), మ్యాక్స్‌వెల్‌(106) సెంచరీలతో నెదర్లాండ్‌ బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టారు. మార్నస్ లబూషేన్ (62) రాణించాడు. మొదట్లో వార్నర్ మెరుపులు మెరిపించగా.. మ్యాచ్‌ ఆఖర్లో మ్యాక్స్‌వెల్‌ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 40 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి ఔరా అనిపించాడు. ఇది వరల్డ్‌ కప్‌ చరిత్రలో వేగవంతమైన శతకం కావడం గమనార్హం. చివరి ఓవర్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి మ్యాక్స్వెల్‌ క్యాచ్‌ ఔట్‌గా పెవిలియన్‌కు చేరాడు. నెదర్లాండ్స్ బౌలర్లలో లోగన్ వాన్ బీక్ 4, బస్ ది లీడ్ 2, ఆర్యన్ దత్​ ఒక వికెట్ తీశారు.

Also Read: Komatireddy Rajagopal Reddy: కేసీఆర్‌ను ఓడించే శక్తి బీజేపీకి ఉందనుకున్నా.. కానీ..

ఆసీస్‌ స్టార్‌ బ్యాటర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ విధ్వంసం సృష్టించాడు. ఆస్ట్రేలియా భారీ స్కోరును సాధించడంలో సహాయం చేశాడు. పాట్ కమ్మిన్స్ మొదట బ్యాటింగ్ ఎంచుకున్న తర్వాత, డేవిడ్ వార్నర్ బౌండరీల వర్షం కురిపించాడు, కానీ అతని ఓపెనింగ్ పార్టనర్ మిచెల్ మార్ష్ ప్రారంభంలోనే వెనుదిరిగాడు. 3వ స్థానంలోకి వచ్చిన స్టీవెన్ స్మిత్ 71 పరుగుల వద్ద ఔటయ్యాడు. వార్నర్ 32 పరుగుల వద్ద లైఫ్‌ని పొందాడు, నెదర్లాండ్స్‌కు మూల్యం చెల్లించేలా చూసుకున్నాడు. 244-2 నుంచి ఆస్ట్రేలియా 290-6కి పడిపోయింది. అనంతరం డచ్‌ బౌలర్లపై గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ విరుచుకుపడ్డాడు. మాక్స్‌వెల్ కేవలం 40 బంతుల్లోనే అత్యంత వేగవంతమైన వన్డే ప్రపంచ కప్ సెంచరీకి చేరుకునే మార్గంలో ఒక్క అవకాశాన్ని కూడా కోల్పోలేదు.