Matrimony cheat: మ్యాట్రిమోని సైట్లలో అందమైన యువతుల ప్రొఫైల్స్ కనిపిస్తే చాలు సంబంధాలు కలిపేసుకుంటున్నారా..? తస్మాత్ జాగ్రత్త. ఫొటోలు మాత్రమే యువతులవి. అమ్మాయిల పేరుతో మిమ్మల్ని నిలువునా ఉంచేస్తారు కేటుగాళ్లు. గతంలో ఇదే తరహాలో మోసపోయిన బాధితుడే.. ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నాడు. తనలా మరొకరు మోసపోవద్దని అప్రమత్తం చేయాల్సిందిపోయి.. తనకు జరిగిన అన్యాయమే మరికొందరికి జరగాలని మోసాలకు పాల్పడుతున్నాడు. లక్షలు దండుకున్న కేటుగాళ్లు పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. ఆంధ్రప్రదేశ్ కాకినాడలోని సూర్యరావుపేటకు చెందిన వ్యక్తి కోమలి సూర్యప్రకాష్..…