మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పాన్ ఇండియా సినిమా తెరకేక్కుతున్న సినిమా మట్కా.. ఈ సినిమా షూటింగ్ పై ఎటువంటి అప్డేట్ లేకపోవడంతో గత కొద్ది రోజులుగా ఈ సినిమా ఆగిపోయిందనే వార్తలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.. బడ్జెట్ ఎక్కువ అవుతోందని, వరుణ్ తేజ్ కు వరస ప్లాఫ్ లు రావటంతో మాత్రం ఏ వర్కవుట్ కావటం లేదని, సినిమాను ఆపేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. అవన్నీ ఫేక్ రూమర్స్ అని తేలింది. ఈ రూమర్స్ పుట్టడానికి కారణం మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గత కొంతకాలంగా ఆపరేషన్ వాలెంటైన్ సినిమాలో బిజీగా ఉండటమే. తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కుతోంది..
ఈ సినిమా ఈనెల విడుదల కావాల్సింది.. కానీ కొన్ని పనులు ఆలస్యం కావడంతో సినిమా మార్చి 1 కి పోస్ట్ పోన్ అయ్యింది.. వరుణ్ తేజ్ నటిస్తున్న మరో సినిమా మట్కా.. ఈ సినిమా షూటింగ్ అప్డేట్స్ రాలేదు.. దాంతో సినిమా ఆగిపోయింది అంటూ ప్రచారం జరుగుతుంది.. తాజాగా ఈ వార్తల పై వరుణ్ తేజ్ స్పందించారు..
ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ 35 రోజులు ఆల్రెడీ పూర్తైంది. రామ్ తాళ్లూరి గారు నాకు క్లోజ్. ఆయన ప్రొడక్షన్ లో పార్టనర్ గా జాయిన్ అ్యయారు. ఒక్కసారి ఆపరేషన్ వాలెంటైన్ ప్రమోషన్స్ పూర్తైతే…మట్కా షూటింగ్ మళ్లీ మొదలు అవుతుంది. అంతేకానీ మట్కా కు ఓవర్ బడ్జెట్ అయ్యిందనో లేదా మరేదో కారణం అయిందనో సినిమా ఆగిపోలేదు అంటూ గట్టిగా ఇచ్చేశాడు.. త్వరలోనే రెగ్యులర్ షూట్‌ను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నారు. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల భారీ ఎత్తున నిర్మించనున్న 1958 లో జరిగే కథ కావడంతో 50, 80ల మధ్య వాతావరణాన్ని రిక్రియేట్ చేయడానికి భారీ సెట్‌లు రూపొందించారు.. వరుణ్ తేజ్ సరసన నోరా ఫతేహి, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు.. త్వరలోనే ఈ సినిమా నుంచి అప్డేట్ రానుందని సమాచారం..