Master Peace : ఓటీటీ లోకి వచ్చేసిన మాస్టర్ పీస్ వెబ్ సిరీస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్టార్ హీరోయిన్ నిత్యామీనన్ ప్రస్తుతం వరుస వెబ్ సిరీస్ లు చేస్తూ దూసుకుపోతుంది. ఈ భామ నటించిన తాజా వెబ్ సిరీస్ మాస్టర్ పీస్ వెబ్‌సిరీస్ ఓటీటీ లో రిలీజైంది. బుధవారం నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో ఈ ఫన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది.ఈ మలయాళ వెబ్ సిరీస్ తెలుగు, తమిళం, హిందీ మరియు కన్నడ భాషల్లో అందుబాటు లో ఉన్నట్లు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ప్రకటించింది. ఈ సిరీస్‌కు శ్రీజీత్ ఎన్ దర్శకత్వం వహించాడు. షరాఫుద్దీన్, రెంజి ఫణిక్కర్ మరియు మాల పార్వతి ముఖ్య పాత్ర లను పోషించారు.విభిన్న భావాలు కలిగిన ఓ జంట పెళ్లితో ఒక్కటైన తర్వాత ఏం జరిగిందన్నది వినోదాత్మకంగా ఈ సిరీస్‌లో డైరెక్టర్ శ్రీజీత్ చూపించారు..
ఇందులో రియా అనే పాత్రలో నిత్యామీనన్ నటించింది. నిత్యా తన గత సినిమాలకు, సిరీస్‌లకు భిన్నం గా ఫుల్ లెంగ్త్ కామెడీ రోల్ తో ఈ సిరీస్‌లో కనిపించింది.అంతే కాకుండా మలయాళంలో నిత్యామీనన్ నటించిన ఫస్ట్ వెబ్ సిరీస్ కూడా ఇదే కావడం విశేషం..బ్రీత్ సిరీస్‌తో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన నిత్యామీనన్ తెలుగులో మోడ్రన్ లవ్ ఇన్ హైదరాబాద్ మరియు శ్రీమతి కుమారి వెబ్‌సిరీస్ లలో నటించి మెప్పించింది.శ్రీమతి కుమారి వెబ్‌సిరీస్ ఇటీవల అమెజాన్ ప్రైమ్‌లో విడుదల అయి మంచి ఆదరణ పొందుతుంది.. ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ తీసుకున్న నిత్యామీనన్ వెబ్‌సిరీస్‌లపై బాగా ఫోకస్ చేస్తుంది.. గత ఏడాది ధనుష్ హీరోగా నటించిన తమిళ చిత్రం తిరు చిత్రాంబళం సినిమాలో హీరోయిన్ గా నటించి బిగ్గెస్ట్ హిట్ అందుకున్నది నిత్యామీనన్.ఈ సినిమా దాదాపు 100 కోట్ల కలెక్షన్స్ సాధించింది.నిత్యా మేనన్ గ్లామర్ పాత్రలకు దూరంగా వుంటూ కథా ప్రాధాన్యత వున్న కథకలకు ఓకే చెబుతుంది. చిన్న హీరో అయినా సరే కథ నచ్చితే ఆ సినిమాకు ఓకే చెబుతుంది.
Also Read
- Mohan Bhagwat: న్యూయార్క్‌లో మోహన్ భగవత్ ర్యాలీపై రగడ.. ఈవెంట్ నిర్వాహకులకు బిగ్ షాక్
- India vs Sri Lanka: చేయాల్సిందంతా చేశాం.. కొలంబో టెస్ట్ డ్రాపై గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- MOTN Survey: మోడీ వైపే ప్రజలు.. కాక్రోచ్ పార్టీకి షాక్.. తాజా సర్వేలో సంచలనం..
- Amaravati Land Pooling: అమరావతిలో మరో విడత ల్యాండ్ పూలింగ్.. 1,654 ఎకరాల భూమి సమీకరణకు నోటిఫికేషన్..
తాజావార్తలు
-
Mohan Bhagwat: న్యూయార్క్‌లో మోహన్ భగవత్ ర్యాలీపై రగడ.. ఈవెంట్ నిర్వాహకులకు బిగ్ షాక్
-
TGSRTC : రాఖీ పండుగకు టీజీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్.. 5,000 స్పెషల్ బస్సులు
-
India vs Sri Lanka: చేయాల్సిందంతా చేశాం.. కొలంబో టెస్ట్ డ్రాపై గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
MOTN Survey: మోడీ వైపే ప్రజలు.. కాక్రోచ్ పార్టీకి షాక్.. తాజా సర్వేలో సంచలనం..
-
India Post GDS : పదో తరగతితో పోస్ట్ఆఫీస్ జాబ్.. 25 వేలకుపైగా పోస్టులు
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!