Site icon NTV Telugu

Earthquake: దక్షిణ అమెరికాలో భారీ భూకంపం… రిక్టర్ స్కేల్‌పై 8 తీవ్రత.. సునామీ హెచ్చరిక!

Earthquakebihar

Earthquakebihar

Earthquake: దక్షిణ అమెరికాలోని డ్రేక్ పాశేజ్ ప్రాంతంలో గురువారం (అక్కడి స్థానిక సమయం ప్రకారం) భారీ భూకంపం సంభవించింది. అమెరికా జియోలాజికల్ సర్వే (USGS) ప్రకారం, ఈ భూకంపం తీవ్రత తొలుత 8గా నమోదు కాగా, తరువాత దాన్ని 7.5కి సవరించారు. రిక్టర్ స్కేల్‌పై ఇలాంటి భారీ తీవ్రత గల భూకంపం సంభవించినప్పుడు సాధారణంగా సునామీ హెచ్చరిక జారీ చేస్తారు. అయితే, ఈసారి అమెరికా సునామీ వార్నింగ్ సిస్టమ్ ఎలాంటి హెచ్చరిక ఇవ్వలేదు. కేవలం చిలీ ప్రభుత్వం మాత్రమే సునామీ అలర్ట్ ప్రకటించింది.

7,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Redmi Note 15 Pro+, Note 15 Pro స్మార్ట్ఫోన్స్ లాంచ్

ఇక USGS వివరాల ప్రకారం, ఈ భూకంపం భూమి 10.8 కిలోమీటర్ల లోతులో సంభవించింది. జర్మనీకి చెందిన జియోలాజికల్ రీసెర్చ్ సెంటర్ మాత్రం ఈ భూకంప తీవ్రతను 7.1గా నమోదు చేసింది. భారత నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (NCS) ప్రకారం భారత కాలమానం ప్రకారం నేడు ఉదయం 07:46:22 గంటలకు ఈ ప్రకంపనలు నమోదయ్యాయి. డ్రేక్ పాశేజ్ ప్రాంతం దక్షిణ అమెరికా, అంటార్కిటిక్ టెక్టానిక్ ప్లేట్ల జంక్షన్ ప్రాంతంలో ఉన్నందున భూకంపాలకు అత్యంత అనువైన ప్రదేశంగా ప్రభావితం అవుతుంది. అయితే ఇప్పటివరకు ఈ భూకంపం కారణంగా పెద్ద ఎత్తున ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం రాలేదు. అయితే స్థానిక ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి.

Parliament Monsoon Session: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలలో ఏ బిల్లులు ఆమోదం పొందాయంటే?

Exit mobile version