Earthquake: దక్షిణ అమెరికాలోని డ్రేక్ పాశేజ్ ప్రాంతంలో గురువారం (అక్కడి స్థానిక సమయం ప్రకారం) భారీ భూకంపం సంభవించింది. అమెరికా జియోలాజికల్ సర్వే (USGS) ప్రకారం, ఈ భూకంపం తీవ్రత తొలుత 8గా నమోదు కాగా, తరువాత దాన్ని 7.5కి సవరించారు. రిక్టర్ స్కేల్‌పై ఇలాంటి భారీ తీవ్రత గల భూకంపం సంభవించినప్పుడు సాధారణంగా సునామీ హెచ్చరిక జారీ చేస్తారు. అయితే, ఈసారి అమెరికా సునామీ వార్నింగ్ సిస్టమ్ ఎలాంటి హెచ్చరిక ఇవ్వలేదు. కేవలం చిలీ ప్రభుత్వం…
హరీకేన్ హిల్లరీ తుఫాను ప్రభావంతో అగ్రరాజ్యం అమెరికా రాష్ట్రాలు వణికిపోతున్నాయి. తుఫాన్ ప్రభావంతో ఆ దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. భీకర గాలులతో కూడిన వర్షం పడటంతో పలు రోడ్లు పూర్తిగా మునిగిపోయాయి. తుఫాన్ తో దక్షిణ కాలిఫోర్నియాలోని చాలా ప్రాంతాల్లో కుండపోతగా వానాలు పడుతున్నాయి.
లాటిన్ అమెరికా దేశమైన ఎల్ సాల్వడార్‌లో భారీ భూకంపం వచ్చింది. పసిఫిక్ మహాసముద్రం తీరంలోని ఎల్ ఎల్వడార్ ప్రాదేశిక జలాల్లో భూమి తీవ్రంగా కంపించింది. దీని తీవ్రత రికార్ట్ స్కేల్ పై 6.5గా నమోదయిందని యూనైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. సముద్ర గర్భంలో 70 కిలోమీటర్ల లోతులో ప్రకంపణలు చోటు చేసుకున్నాయని జియోలాకల్ సర్వేలో పేర్కొనింది.
పెరూ, ఈక్వెడార్‌లను భారీ భూకంపం శనివారం వణికించింది. ఈ శక్తివంతమైన భూకంపంలో దాదాపు 12 మంది మృతి చెందగా.. ఒకరు గాయపడినట్లు సమాచారం. భవనాలు చాలా వరకు దెబ్బతిన్నాయని ఈక్వెడార్ ప్రెసిడెన్సీ తెలిపింది.
Earth Quake : అమెరికాలోని కాలిఫోర్నియాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.4గా నమోదైంది. ఉత్తర కాలిఫోర్నియాలోని యురేకా ప్రాంతంలో భూమి కంపించింది.