Sabarimala Darshan: శబరిమలకు పోటెత్తిన భక్తులు.. పంబ వరకు క్యూ లైన్లు
- జనవరి 14న మకర జ్యోతి దర్శనం.
- పంబ వరకు భారీగా భక్తుల క్యూ లైన్లు.
- స్వామి దర్శనానికి 12 గంటలపాటు సమయం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sabarimala Darshan: కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి ఆలయానికి ఈ నెల 14న మకర జ్యోతి దర్శనం సందర్భంగా భక్తులు పెద్దఎత్తున్న చేరుకుంటున్నారు. పెద్ద సంఖ్యలో శబరిమల చేరిన భక్తులతో, ఆలయ పరిసరాల్లో భక్తుల రద్దీ బాగా పెరిగింది. దీనితో భక్తులు క్యూ లైన్లలలో ఇబ్బందులు పడుతున్నారు. ఇక అయ్యప్ప స్వామి దర్శనానికి 12 గంటలపాటు సమయం పడుతున్నట్లు సమాచారం. పంబ వరకు అయ్యప్ప భక్తులు క్యూ లైన్లలో నిలబడి ఉన్నారు. అయితే, రద్దీ కారణంగా 4 వేల మందికి మాత్రమే స్పాట్ దర్శనం కల్పించనున్నారు. అలాగే మరిన్ని దర్శనాలను సౌకర్యవంతంగా చేయడానికి ట్రావెన్ కోర్ దేవస్థానం ఆన్లైన్ దర్శనాలపై నియంత్రణ విధించింది.
Also Read: Rythu Bharosa: రైతు భరోసా నిబంధనలు ఇవే.. వారికి నిరాశే..
Also Read
అలాగే సోమవారం నుంచి ఆన్లైన్ దర్శనాలకు పరిమితి విధించనున్నారు. 13వ తేదీన 50 వేల మందికి, 14వ తేదీన 40 వేల మందికి దర్శనం ఇవ్వనున్నట్లు అధికారులు ప్రకటించారు. 15వ తేదీకి 60 వేల మందికి ఆన్లైన్ దర్శన సేవలు అందించే ప్రణాళికలు సిద్ధం చేశారు అధికారులు. ట్రావెన్ కోర్ దేవస్థానం అధికారులు శబరిమలలో భక్తులకు అన్ని సౌకర్యాలను కల్పించేందుకు పూర్తిగా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. 14వ తేదీన మకర జ్యోతి దర్శనం సందర్భంగా భక్తులకు సరైన వసతులు కల్పించడానికి అన్ని అవసరమైన చర్యలు తీసుకున్నారు.
తాజావార్తలు
-
ACB Raids : నిమ్స్ అధికారిపై ఏసీబీ సోదాలు.. బినామీల ఇళ్లలో కీలక పత్రాలు
-
Thackeray Brothers: CJP ఆందోళనకు ఉద్ధవ్, రాజ్ ఠాక్రేల మద్దతు.!
-
Balochistan: పాక్ సైనికులపై BLA మహిళా యూనిట్ దాడి.. 9 మంది హతం..
-
Virat Kohli Hundred Centuries: విరాట్ కోహ్లీ 100 శతకాలు సాధిస్తాడా.. ఇదిగో సాధ్యసాధ్యాలు..
-
TGSPDCL : విద్యుత్ డిమాండ్లో కొత్త రికార్డు.. 12,044 మెగావాట్లు.!
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!