Accident : సిద్ధిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు విద్యార్థులు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సిద్ధిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిన్న కోడూరు మండలం అనంత సాగర్ శివారులోని రాజీవ్ రహదారిపై అగి ఉన్న ఇసుక లారీని వెనుక నుంచి క్వాలిస్ వాహనం ఢీ కొట్టింది. దీంతో.. ఘటనా స్థలంలోనే ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. మరో ఎనిమిది మంది సీరియస్‌గా ఉన్నారు. క్వాలిస్‌లో మొత్తం11మంది ఇంజనీరింగ్ విద్యార్థులు ప్రయాణిస్తున్నట్లు ప్రాథమిక సమాచారం. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని క్షతగాత్రులను చికిత్స కోసం సిద్దిపేట ప్రభుత్వ దవాఖానకు తరలించారు. నితిన్ , గ్రీష్మ, నమ్రత అనే ముగ్గురు విద్యార్థులు ప్రమాద స్థలంలోనే మరణించారు. వీరంతా కరీంనగర్‌లోని తిమ్మాపూర్‌లో పరీక్ష రాసి సిద్దిపేటకు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. విద్యార్థులంతా సిద్దిపేట ఇందూర్ ఇంజినీరింగ్ కళాశాలలో చదువుకుంటున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read : Ashtadigbandhanam Trailer: అహంతో మొదలైన యుద్ధం అప్పుడే ముగుస్తుంది!
Also Read
- iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
- Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
- Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
- IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు కొత్త పోస్టింగ్‌లు..
అయితే.. ఇంజనీరింగ్ విద్యార్థుల మృతి ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి హరీష్ రావు.. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ నలుగురు విద్యార్థులను మెరుగైన వైద్యం కొరకు హైదరాబాద్ తరలించాలని వైద్యులను ఆదేశించారు. గాయాలైన మరికొంత మంది విద్యార్థులను సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో మెరుగైన చికిత్స అందించాలని మంత్రి హరీష్ రావు సూచించారు. మృతి చెందిన విద్యార్థులకు సంతాపం వ్యక్తం చేస్తూ ప్రగాఢ సానుభూతి తెలిపారు మంత్రి హరీష్ రావు. అధైర్య పడొద్దు అండగా ఉంటానని మంత్రి హరీష్ రావు విద్యార్థుల కుటుంబాలతో ఫోన్ లో మాట్లాడి మనోధైర్యాన్ని నింపారు.
Also Read : Bihar: సార్ మేమెక్కడ కూర్చోవాలి.. ఆగ్రహించిన విద్యార్థినులు
తాజావార్తలు
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
-
Sanju Samson: 3 పరుగులకే సంజు శాంసన్ అవుట్.. ఆశ్చర్యం ఏముంది.. కామెంటేటర్ సంచలన వ్యాఖ్యలు!
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
ట్రెండింగ్
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!