Site icon NTV Telugu

Masala Vada Recipe: బండి మీద అమ్మేలా కరకరలాడే ‘మసాలా వడలు’.. ఈ చిట్కాలతో చేస్తే టేస్ట్ అదిరిపోతుంది.!

Masala Vada

Masala Vada

సాయంత్రం వేళ వేడివేడిగా ఏదైనా స్నాక్స్ తినాలనిపిస్తే అందరికీ ముందుగా గుర్తొచ్చేది మసాలా వడ. బండి మీద దొరికే మసాలా వడలు పైన కరకరలాడుతూ, లోపల మెత్తగా భలే రుచిగా ఉంటాయి. అచ్చం అదే రుచితో ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ చిట్కాలతో ఇక్కడ తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు:

తయారీ విధానం:
1. పప్పు నానబెట్టడం:
ముందుగా ఒక కప్పు పచ్చి శనగపప్పును శుభ్రంగా కడిగి, కనీసం 2 నుండి 3 గంటల పాటు నానబెట్టుకోవాలి. పప్పు బాగా నానితేనే వడలు పైన క్రిస్పీగా వస్తాయి. ఒకవేళ సమయం లేకుంటే వేడి నీటిలో 30 నుంచి 40 నిమిషాలు నానబెట్టాలి.

VDxSHOURYUV : రౌడీ స్టార్ కోసం నేచురల్ స్టార్..విజయ్-నాని సందడి!

2. పప్పు గ్రైండింగ్:
నానబెట్టిన శనగపప్పు నుండి 2 టేబుల్ స్పూన్ల పప్పును పక్కన పెట్టుకోవాలి (ఇది వడలకు మంచి లుక్ ఇస్తుంది). మిగిలిన పప్పులోని నీరు పూర్తిగా వడకట్టి, మిక్సీ జార్‌లో పప్పుతో పాటు అల్లం ముక్క, వెల్లుల్లి రెబ్బలు వేసి నీరు పోయకుండా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. గుర్తుంచుకోండి, పిండి మరీ మెత్తగా అవ్వకూడదు.

3. మిశ్రమాన్ని కలుపుకోవడం:
గ్రైండ్ చేసిన పప్పు మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని, అందులో ముందుగా పక్కన పెట్టిన పచ్చి పప్పు, తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర, పచ్చిమిర్చి , రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.

Tamanna Simhadri: తల్లి కాబోతున్న ట్రాన్స్‌జెండర్ తమన్నా సింహాద్రి: అసలు కుదురుతుందా?

4. వడలు వేయడం:
బాణలిలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేయాలి. నూనె కాగిన తర్వాత, పిండిని చిన్న, చిన్న సైజులో తీసుకుని అరచేతిపై పెట్టి వడల్లా ఒత్తుకోవాలి. మరీ మందంగా కాకుండా కొంచెం పల్చగా ఒత్తుకుంటే లోపల కూడా బాగా ఉడుకుతాయి.

5. వేయించడం:
మంటను మీడియం ఫ్లేమ్ మీద ఉంచి వడలను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు రెండు వైపులా వేయించుకోవాలి. హై ఫ్లేమ్ మీద వేయిస్తే పైన రంగు వస్తుంది కానీ లోపల పచ్చిగా ఉంటుంది.

అంతే..! ఎంతో రుచికరమైన, కరకరలాడే స్ట్రీట్ స్టైల్ మసాలా వడలు రెడీ. వీటిని అల్లం చట్నీతో లేదా టమోటా కెచప్‌తో తింటే రుచి అద్భుతంగా ఉంటుంది.

 

Exit mobile version