శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) మరో శుభవార్త చెప్పింది.. తిరుమలలో భక్తులకు ఉచితంగా అందించే అన్నప్రసాదంలో మసాలా వడను చేర్చింది. తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ఈ రోజు భక్తులకు వడ ప్రసాదం అందించే కార్యక్రమాన్ని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరిలతో కలిసి అధికారికంగా ప్రారంభించారు.
శ్రీవారి భక్తులకు మరింత రుచికరంగా అన్నప్రసాదాలు అందించాలని టీటీడీ నిర్ణయించిన విషయం తెలిసిందే. టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయం మేరకు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం మెనూలో మసాలా వడను చేర్చారు. అయితే ప్రస్తుతం ఇది ట్రయల్ రన్‌లో ఉంది. ట్రయల్ రన్‌లో భాగంగా సోమవారం 5 వేల మసాలా వడలను టీటీడీ సిబ్బంది భక్తులకు వడ్డించారు. మరో వారం పాటు పరిశీలించిన తరువాత పూర్తి స్థాయిలో అమలు చేస్తారని తెలుస్తోంది. శ్రీవారి భక్తులకు కొన్నేళ్లుగా…
శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పింది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. అన్నప్రసాద వితరణ కేంద్రంలో భోజనంతో పాటు మసాలా వడలు పెట్టాలని ప్రయోగాత్మకంగా పరిశీలన ప్రారంభించారు.. ఇవాళ అన్నప్రసాద కేంద్రంలో ట్రయల్ రన్ లో భాగంగా దాదాపు 5 వేల మంది భక్తులకు (ఉల్లిపాయ వాడకుండా) చేసిన మసాలా వడలు వడ్డించారు టీటీడీ సిబ్బంది..