Maruti Suzuki Offers: మారుతి కార్లపై భారీ డిస్కౌంట్స్.. ఆఫర్ కొద్దిరోజులు మాత్రమే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Offers on on Maruti Suzuki Dzire, Maruti Suzuki Swift and Maruti Alto 800: మీరు కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా?.. ఇదే మంచి సమయం. ప్రముఖ వాహన తయారీ సంస్థ ‘మారుతీ సుజుకి’ తన అరేనా లైనప్‌లోని ఎంపిక చేసిన మోడల్‌లపై భారీ తగ్గింపును అందిస్తోంది. మారుతీ ఆల్టో 800, మారుతీ కే 10, మారుతీ ఎస్ ప్రెస్సో, మారుతీ స్విఫ్ట్, మారుతీ ఎకో, మారుతీ సెలెరియో లాంటి కార్లపై ఆఫర్స్ ఉన్నాయి. కంపెనీ ఏ మోడల్ కారుకి ఎంత డిస్కౌంట్ ఇస్తుందో ఇప్పుడు చూద్దాం.
Maruti Alto 800 Price:
మారుతీ ఇప్పుడు ఆల్టో 800 కారు ఉత్పత్తిని నిలిపివేసింది. దీంతో మిగిలిన ఉన్న కార్లపై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ఈ కారు మోడల్ బట్టి రూ. 30,000 నుంచి రూ. 50,000 వరకు తగ్గింపు లభిస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. 799 cc ఇంజన్‌ను కలిగి ఉంది. ఈ ఆఫర్ సీఎన్జీ మోడల్లో కూడా అందుబాటులో ఉంది.
Also Read
- GPS, 5ATM వాటర్ రెసిస్టెన్స్, 110+ పైగా స్పోర్ట్స్ మోడ్లతో Realme Watch S5 ఎంట్రీ.!
- Twisha Sharma: ట్విషా శర్మ మరణానికి ముందు ఎక్కడకెళ్లిందంటే.. వెలుగులోకి వీడియో
- SRH vs RCB: 300+ లోడింగ్.. మొదట బ్యాటింగ్ చేయనున్న కాటేరమ్మ కొడుకులు.!
- Machilipatnam: కామర్స్ లెక్చరర్ 'కామ లీలలు'.. ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపిన వైనం.. సడెన్‌గా భార్య ఎంట్రీ..!
Maruti Suzuki Dzire Price:
మారుతి డిజైర్ ఆటోమేటిక్ మరియు మాన్యువల్ వేరియంట్లపై రూ. 17,000 ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి . కానీ సీఎన్జీ వేరియంట్‌పై ఎటువంటి తగ్గింపు లేదు. ఇది 90 హెచ్‌పిని ఉత్పత్తి చేసే 1.2 లీటర్ డ్యూయల్‌జెట్ పెట్రోల్ ఇంజన్‌ను కలిగి ఉంటుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ మరియు ఏఎంటీ గేర్‌బాక్స్ ఎంపికను కలిగి ఉంది.
Maruti Alto K10 Price:
ఆల్టో కే 10 1.0-లీటర్ డ్యూయల్ జెట్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఇది 5 స్పీడ్ మ్యాన్యువల్, ఏఎంటీ ట్రాన్స్మిషన్ ఎంపికను కలిగి ఉంది. దీనికి సీఎన్జీ ఆప్షన్ కూడా ఉంది. ఈ కారుపై కంపెనీ రూ. 50,000 నుంచి రూ. 60,000 వరకు తగ్గింపును అందిస్తోంది.
Maruti Suzuki Swift Price:
మారుతి స్విఫ్ట్ 1.2-లీటర్ డ్యూయల్ జెట్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్, ఏఎంటీ గేర్‌బాక్స్ ఎంపికను కలిగి ఉంది. ఈ కారు మాన్యువల్ వేరియంట్‌పై రూ. 45,000, ఆటోమేటిక్ వేరియంట్‌పై రూ. 50,000 వరకు తగ్గింపు ఉంది. ఇక సీఎన్జీ వేరియంట్‌పై రూ. 25,000 తగ్గింపు లభిస్తుంది.
Maruti Suzuki S Presso Price:
మారుతి ఎస్ ప్రెస్సో 1.0-లీటర్ ఇంజన్, రెండు గేర్‌బాక్స్‌ల ఎంపికను కలిగి ఉంటుంది. అలాగే సీఎన్జీ ఎంపిక కూడా ఇందులో అందుబాటులో ఉంది. ఈ కారుపై రూ. 55,000 నుంచి రూ. 65,000 వరకు తగ్గింపు లభిస్తుంది.
Also Read: Gold Rate Today: బంగారం ప్రియులకు శుభవార్త.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే?
Maruti Suzuki Celerio Price:
మారుతి సెలెరియో మాన్యువల్ ట్రాన్స్మిషన్ వేరియంట్‌పై దాదాపు రూ. 65,000 తగ్గింపు, ఆటోమేటిక్ వెర్షన్‌పై రూ. 35,000, సీఎన్జీ వేరియంట్‌పై రూ. 65,000 తగ్గింపు ఉంది. ఈ కారు 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ ఏఎంటీ గేర్‌బాక్స్‌తో జతచేయబడిన 1.2-లీటర్ డ్యూయల్‌జెట్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది.
Maruti Suzuki Wagon R Price:
మారుతి సుజుకి వ్యాగన్ఆర్ అన్ని వేరియంట్లపై రూ. 45,000 నుంచి రూ. 60,000 వరకు తగ్గింపును అందిస్తోంది. వ్యాగన్ఆర్ 1.0-లీటర్, 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్లతో సీఎన్జీ పవర్ట్రైన్ ఎంపికను కూడా కలిగి ఉంటుంది.
Maruti Suzuki Eeco Price:
మారుతీ సుజుకి ఎకో ఎమ్పివిపై రూ. 39,000 వరకు తగ్గింపు ఉంది. సీఎన్జీ మరియు కార్గో వేరియంట్లపై రూ. 38,000 వరకు ఆఫర్లు ఉన్నాయి. మారుతి ఎకోలో 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది 73 హెచ్‌పి పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు 5 మరియు 7 సీట్ల కాన్ఫిగరేషన్లను కలిగి ఉంది.
Also Read: Heavy Rains: వణకుతున్న ఉత్తరాది.. కుంభవృష్టితో అతలాకుతలం.. 60 మందికి పైగా మృతి
తాజావార్తలు
-
GPS, 5ATM వాటర్ రెసిస్టెన్స్, 110+ పైగా స్పోర్ట్స్ మోడ్లతో Realme Watch S5 ఎంట్రీ.!
-
Natural Hair Tonic : పలుచటి జుట్టుకు గుడ్‌బై.. ఇంట్లోనే తయారయ్యే మ్యాజికల్ హెయిర్ టానిక్.!
-
Cabbage Egg Sandwich : కొరియన్ స్ట్రీట్ స్టైల్ ‘క్యాబేజీ ఎగ్ శాండ్విచ్’.. 5 నిమిషాల్లో పిల్లల లంచ్ బాక్స్ కోసం సూపర్ రెసిపీ.!
-
Twisha Sharma: ట్విషా శర్మ మరణానికి ముందు ఎక్కడకెళ్లిందంటే.. వెలుగులోకి వీడియో
-
SRH vs RCB: 300+ లోడింగ్.. మొదట బ్యాటింగ్ చేయనున్న కాటేరమ్మ కొడుకులు.!
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్‌తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!