Today Gold and Silver Prices in Hyderabad: గత కొన్ని రోజులుగా బంగారం ధరలు పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి. శనివారం ధరలు తగ్గగా.. ఆదివారం భారీగా పెరిగాయి. ఇక సోమవారం స్థిరంగా కొనసాగిన పసిడి ధరలు మంగళవారం కాస్త తగ్గాయి. బులియన్ మార్కెట్‌లో మంగళవారం (జులై 11) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,450 ఉండగా.. 24 క్యారెట్ల (999 Gold) 10 గ్రాముల బంగారం ధర రూ. 59,410లుగా ఉంది.
నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 100 తగ్గగా.. 24 క్యారెట్ల బంగారం ధరపై కూడా రూ. 100 తగ్గింది. ఈ బంగారం ధరలు దేశీయ మార్కెట్లో మంగళవారం ఉదయం 6 గంటలకు నమోదైనవి. ఇక పసిడి ధరలు దేశంలోని పలు నగరాల్లో ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం.
# ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,600 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,560గా ఉంది.
# ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 54,450 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,410గా నమోదైంది.
# చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,850లు ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,840 వద్ద కొనసాగుతోంది.
# బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 54,450లుగా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,510లుగా ఉంది.
# కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,450 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,410వద్ద కొనసాగుతోంది.
# హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 54,450 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,410గా ఉంది.
# విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,450 కాగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,410గా నమోదైంది.
# విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ. 54,450 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,410 వద్ద కొనసాగుతోంది.
మరోవైపు వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. దేశీయ మార్కెట్‌లో కిలో వెండి ధర ఈరోజు రూ. 73,400లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే కిలో వెండి ధరపై రూ. 100 పెరిగింది. ముంబైలో కిలో వెండి ధర రూ. 73,400లుగా ఉండగా.. చెన్నైలో రూ. 76,800లుగా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ. 72,750గా ఉండగా.. హైదరాబాద్‌లో రూ. 76,800లుగా నమోదైంది. ఇక విజయవాడ, విశాఖపట్నంలో కూడా కిలో వెండి ధర రూ. 76,800ల వద్ద కొనసాగుతోంది.
Also Read: Jaipur: పెరుగుతున్న టమాటా చోరీలు.. తలలు పట్టుకుంటున్న అధికారులు
Also Read: DRDO Recruitment : డీఆర్డీఓలో భారీగా ఉద్యోగాలు.. దరఖాస్తులకు కొద్ది రోజులు మాత్రమే గడువు..