Maruti Suzuki: మారుతీ లవర్స్‌కు షాక్.. మరింత పెరగనున్న కారు ధరలు
- ఆటోమొబైల్ రంగంలో అగ్రగామిగా ఉన్న మారుతీ సుజుకీ.
- మరోమారు పెరగనున్న మారుతీ సుజుకీ కారు ధరలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maruti Suzuki: దేశీయ ఆటోమొబైల్ రంగంలో అగ్రగామిగా ఉన్న మారుతీ సుజుకీ (Maruti Suzuki) వాహన ప్రియులకు మరోసారి షాకిచ్చింది. ఏప్రిల్ 1 నుంచి తమ వాహనాల ధరలను పెంచుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు కంపెనీ తాజాగా రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వివరాలు వెల్లడించింది. పెరుగుతున్న ఉత్పత్తి ఖర్చులు, నిర్వహణ వ్యయాల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మారుతీ సుజుకీ పేర్కొంది. ఈ పెంపు అత్యధికంగా 4% వరకు ఉండనుందని తెలిపింది.
Read Also: Rohit Sharma: ఏంటి రోహిత్.. అంత కోపమెందుకు?
Also Read
- SKY: కెప్టెన్సీ తప్పించడంపై సూర్యకుమార్ యాదవ్ ఎమోషనల్.. ఫస్ట్ రియాక్షన్ ఇదే..
- Car Accident: యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై దారుణం.. కదులుతున్న జాగ్వార్ కారులో అగ్నిప్రమాదం..
- KL Rahul: కేఎల్ రాహుల్ అద్భుత సెంచరీ.. ఆ రికార్డుల జాబితాలోకి చేరిక..
- Lalu-Rabri Security: లాలూ, రబ్రీదేవికి జెడ్ ప్లస్ భద్రత తొలగింపు.. కర్రలతో కాపలా కాస్తోన్న కార్యకర్తలు
వాహన తయారీకి అవసరమైన ముడి పదార్థాల ధరలు గణనీయంగా పెరుగుతుండటంతో ఉత్పత్తి వ్యయం బాగా పెరిగింది. అంతేకాదు అంతర్జాతీయ కమోడిటీ ధరల పెరుగుదల, అధిక దిగుమతి సుంకాలు వంటి కారకాలు కూడా దీనికి కారణమని మారుతీ సుజుకీ వెల్లడించింది. ఈ ఖర్చులను పూర్తిగా భరిస్తూ వెళితే సంస్థపై ప్రభావం పడనుండడంతో వినియోగదారులపై కొంతభాగాన్ని మోపక తప్పని పరిస్థితి ఏర్పడిందని వెల్లడించింది.
ఈ ఏడాదిలో మారుతీ సుజుకీ వాహనాల ధరలు పెరగడం ఇది మూడోసారి కావడం గమనార్హం. 2025 జనవరిలో మారుతీ తన కార్లపై 4% వరకు ధరలను పెంచింది. ఫిబ్రవరిలో మరికొన్ని మోడళ్లపై ధరలు సవరించింది. అప్పట్లో మారుతీ కార్ల ధరలు మోడల్‌ను బట్టి రూ.1,500 నుంచి రూ.32,500 వరకు పెరిగాయి. తాజా నిర్ణయంతో ఏప్రిల్ 1 నుంచి మరిన్ని మోడళ్లపై ధరల పెంపు ఉండబోతోంది. అయితే, సంస్థ ఇంకా ఏ మోడల్‌పై ఎంత పెరుగుతుందో స్పష్టమైన వివరాలు వెల్లడించలేదు.
Read Also: Ranya Rao : పెళ్లైన నెలకే విడివిడిగా ఉంటున్నాం : రన్యారావు భర్త
మారుతీ సుజుకీ ధరలు పెంచుతున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో నేడు కంపెనీ షేర్లు స్టాక్ మార్కెట్లో లాభాల్లో కొనసాగాయి. పెట్టుబడిదారులు కంపెనీ ధరల వ్యూహాన్ని మద్దతు ఇస్తుండడంతో, మారుతీ స్టాక్స్‌లో కొంత స్థిరత్వం కనిపిస్తోంది. మారుతీ మాత్రమే కాకుండా, 2025 ప్రారంభం నుంచి దాదాపు అన్ని ప్రధాన ఆటోమొబైల్ తయారీ సంస్థలు తమ వాహనాలపై ధరలను పెంచుతున్నాయి. మారుతీ మూడోసారి ధరలు పెంచిన నేపథ్యంలో, ఇతర కంపెనీలు కూడా త్వరలోనే ధరల పెంపుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
IndiGo Flight : వాతావరణం దెబ్బకు ఇండిగో విమానం డైవర్ట్.. రాజమండ్రిలో ఎమర్జెన్సీ ల్యాండింగ్.!
-
SKY: కెప్టెన్సీ తప్పించడంపై సూర్యకుమార్ యాదవ్ ఎమోషనల్.. ఫస్ట్ రియాక్షన్ ఇదే..
-
Stree Ride : మహిళల కోసం ‘స్త్రీ రైడ్’.. ఇక డ్రైవర్ కూడా మహిళే..!
-
Car Accident: యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై దారుణం.. కదులుతున్న జాగ్వార్ కారులో అగ్నిప్రమాదం..
-
KL Rahul: కేఎల్ రాహుల్ అద్భుత సెంచరీ.. ఆ రికార్డుల జాబితాలోకి చేరిక..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!