Maruthi: ‘రాజాసాబ్’ ఫ్లాప్ కావాలని కొందరు తెగ తాపత్రయపడుతున్నారు: మారుతి షాకింగ్ కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maruthi: ఫ్యాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన కొత్త సినిమా ‘ది రాజాసాబ్’. డైరెక్టర్ మారుతి ఈ సినిమాను హారర్ కామెడీగా తెరకెక్కించారు. ఇది సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో ప్రచారంలో భాగంగా డైరెక్టర్ మారుతి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇంతకీ ఆయన చేసిన ఆ షాకింగ్ కామెంట్స్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: Congress: “రాహుల్ గాంధీ శ్రీరాముడట”.. కాంగ్రెస్ నాయకుడి “అతి భజన”పై బీజేపీ ఫైర్..
Also Read
ఈ సందర్భంగా డైరెక్టర్ మారుతిని ఇంటర్వ్యూలో భాగంగా.. మీ సినిమా సరిగ్గా ఆడకూడదని, విజయం సాధించకూడదని కొందరు కోరుకుంటున్నారు, నిజానికి వాళ్లు అలా ఎందుకని ఆలోచిస్తున్నారు అనే ప్రశ్నకు బదులిస్తూ.. తాను సక్సెస్ అందుకుంటే మరిన్ని ప్రాజెక్టులతో బిజీగా మారుతానని వాళ్లు అలా అనుకుంటూ ఉండవచ్చని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈర్ష్య, అసూయ మానవ నైజం అని అన్నారు. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్లు అనుకుంటారని, నేను సక్సెస్‌తో పై మెట్టు ఎక్కితే వాళ్లకు ఎక్కడ దొరకనేమో అనే భయంతోనే అలా అనుకుంటారని అన్నారు. అయితే తానెప్పుడూ స్టార్డమ్ శాశ్వతం అనుకోనని వెల్లడించారు. తనకు కథ ముఖ్యం అని, దానికి ఏ హీరో సెట్ అవుతారు అనుకుంటే ఆయనతో సినిమా తీస్తానని ‘ది రాజాసాబ్’ తర్వాత చిన్న సినిమా తీయాలనుకుంటే తీస్తాను. చాలా కథలు ఉన్నాయి. స్టార్ హీరోతో సినిమా చేశాను అని, అన్నీ అంత భారీ స్థాయిలోనే తీయాలనే ఆలోచనలు, కోరికలు లేవని స్పష్టం చేశారు. కానీ తనకు మాత్రం ఎప్పుడూ పని ఉండాలని మాత్రం కోరుకుంటానని చెప్పారు. రొమాంటిక్ హారర్ కామెడీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం 2026 సంక్రాంతి కానుకా జనవరి 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది.
READ ALSO: Vanaveera Review : వనవీర రివ్యూ
తాజావార్తలు
-
US Woman Shocked: అమెరికాలో రూ.85 వేలు, భారత్‌లో రూ.35 మాత్రమే.. మందుల ధరలపై మహిళ షాక్..
-
PM Modi: న్యూజిలాండ్ టూర్‌కు మోడీ.. 40 ఏళ్లలో తొలి భారత ప్రధానిగా రికార్డ్
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో
-
Falcon Scam : 14 కోట్ల విమానం 3 కోట్లకే.. దేశంలోనే తొలిసారిగా విమానాన్ని ఈ-వేలం.!
-
Instagram: ఇంస్టాగ్రామ్కు కేంద్రం నోటీసులు.!
ట్రెండింగ్
-
Smoking While Drinking Tea: ‘టీ’తో పాటు ‘సిగరెట్’ తాగుతున్నారా.? ఆ రోగాలకు రెడ్ కార్పెట్ పరిచినట్లే.!
-
Home Tips : ఇంట్లోకి తేళ్లు రాకుండా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
14 రోజుల బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో HUAWEI Band 11 సిరీస్ భారత్‌లో లాంచ్..!
-
IND vs ENG 2nd T20: సంజును తొలగించకుండా, వైభవ్‌కు అవకాశం ఇవ్వాలంటే.. ఇదొక్కటే మార్గం!
-
IND vs ENG 2nd T20: సంజు అవుట్, వైభవ్ ఇన్.. రెండో టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!