Mulugu Bokka: మూలుగ బొక్క కోసం లొల్లి.. పెళ్లి సంబంధం రద్దు! అచ్చం బలగం సినిమా మాదిరే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Marriage was Cancelled for Mooluga Bokka in Telangana: ‘బలగం’ సినిమాలో మూలుగ బొక్క కోసం బావ బామ్మర్దుల మధ్య జరిగే గొడవ అందరికీ గుర్తుండే ఉంటుంది. పెళ్లి అనంతరం పండగకు అత్తారింటికి వచ్చిన అల్లుడికి మూలుగ బొక్క వేయకపోవడంతో బావ, బామ్మర్దుల మధ్య జరిగిన గొడవ.. ఆ కుటుంబంలో కలహాలకు దారి తీస్తుంది. అచ్చం అలాగే మూలుగ బొక్క కోసం జరిగిన గొడవ.. చిరవకు పెళ్లి సంబంధం రద్దు అయ్యే వరకు వెళ్లింది. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది.
వివరాల ప్రకారం… జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలానికి చెందిన అబ్బాయికి, నిజామాబాద్ జిల్లాకు చెందిన అమ్మాయితో వివాహం నిశ్చయమైంది. ఇరు కుటుంబసభ్యులు కట్నకానుకలు మాట్లాడుకున్నారు. ఇక్కడివరకు అంతా సాఫీగానే సాగింది. ఇక నవంబరు మొదటి వారంలో వివాహ నిశ్చితార్ధం సందర్భంగా.. ఆడపెళ్లి వారి ఇంట మాంసాహారంతో భోజనాలు పెట్టారు. అబ్బాయి తరఫు బంధువులు మూలుగ బొక్క కావాలని అడిగారు. దాంతో ఇరువర్గాల మధ్య చిన్న గొడవ మొదలైంది. ఈ గొడవ చిలికి చిలికి.. గాలివానగా మారింది.
Also Read
- Astrology: ఆగస్టు 10 సోమవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్ న్యూస్..
- VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్‌కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
- CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
- New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
Also Read: CM Revanth Reddy: నేడు కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం!
మూలుగ బొక్క గొడవ చివరికి పోలీస్‌స్టేషన్ వరకు వెళ్లింది. అక్కడ ఇరువర్గాలు శాంతించినప్పటికీ.. పెళ్లి సంబంధాన్ని రద్దు చేసుకున్నారు. దీంతో ఈ విషయం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విషయం తెలిసిన వారు ముక్కున వేలేసుకుంటున్నారు. వివాహ సమయంలో ఒక్కోసారి చిన్న చిన్న విషయాలే పెద్ద గొడవకు కారణం అవుతాయన్న విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Tragedy: నార్సింగిలో ఘోర రోడ్డు ప్రమాదం.. రాంగ్ రూట్లో దూసుకొచ్చిన కారు, ఆర్మీ జవాన్ మృతి
-
Kapali: హన్సిక ‘కపాలి’ ఫస్ట్ లుక్.. కళ్లతోనే భయపెడుతున్న హీరోయిన్!
-
Delimitation Bill 2026: పార్లమెంట్లో డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. డీఎంకే 22 మంది ఎంపీలే కీలకం, ఎన్డీఏకు పరీక్ష
-
Astrology: ఆగస్టు 10 సోమవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్ న్యూస్..
-
Hash Oil : స్నాప్‌చాట్‌లో డ్రగ్స్ దందా.. ORR వద్ద పెడ్లర్ అరెస్ట్.!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!