Indira Canteen: ప్రయాణికులకు శుభవార్త.. రూ.10కే భోజనం, రూ. 5 లకు అల్ఫాహారం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka Govt Plans Indira Canteens at Bangalore Airport: కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో లివింగ్ కాస్ట్ చాలా ఎక్కువ అన్న విషయం తెలిసిందే. హైదరాబాద్‌తో పోలిస్తే దాదాపు డబుల్ రేట్స్ అక్కడ ఉంటాయి. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో కప్పు టీ లేదా కాఫీకి రూ. 200 నుంచి రూ. 500 ఉంటుంది. అదే భోజనం చేయడానికి రూ. 500-1,000 చెల్లించుకోవాల్సిందే. అధిక ధరలతో ఇబ్బందిపడుతున్న ప్రయాణికులకు ఓ శుభవార్త. బెంగుళూరు విమానాశ్రయంలో కేవలం 10 రూపాయలకే భోజనం అందించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ‘ఇందిరా క్యాంటీన్’ను విమానాశ్రయంలో ప్రారంభించాలని కర్ణాటక కేబినెట్ సమావేశం నిర్ణయించింది.
బెంగళూరులో ఇప్పటికే 175కి పైగా ఇందిరా క్యాంటీన్‌లు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నగరాలు, పట్టణాల్లో ఇందిరా క్యాంటీన్‌లలో కేవలం రూ. 5కే అల్ఫాహారం, రూ. 10కే మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. బీజేపీ ప్రభుత్వ హయాంలో ఇందిరా క్యాంటీన్‌లకు నాణ్యమైన ఆహారం అందడం లేదని.. వాటిని మూసేయాలని ఆలోచన చేశారు. అయితే ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో.. సీఎం సిద్ధరామయ్య ఇందిరా క్యాంటీన్‌లోని లంచ్, స్నాక్స్ మెనూను మార్చారు. రాగి ముద్ద, మంగళూరు బన్స్‌తో సహా పలు రకాల భోజనాలు వడ్డిస్తున్నారు.
Also Read
- Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
- Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
- Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
- Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
Also Read: Gold Price Today: భారీగా పెరిగిన బంగారం ధర.. తులం ఎంతకు చేరిందో తెలుసా?
ఖరీదైన ఫుడ్ అవుట్‌లెట్లలో కూడా ఇందిరా క్యాంటీన్ భోజనం ప్రారంభించాలని కర్ణాటక ప్రభుత్వం యోచిస్తోంది. సామాన్యులు, మధ్యతరగతి, వ్యాపారులు, విలాసవంతమైన వ్యక్తులకు గమ్యస్థానంగా ఉన్న బెంగళూరులోని నాడప్రభు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇందిరా క్యాంటీన్ ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అల్పాహారం రూ. 5, మధ్యాహ్న భోజనం రూ.10కే అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. బెంగళూరు విమానాశ్రయంలో ఇందిరా క్యాంటీన్‌ను త్వరలోనే ప్రారంభం కానుంది. విమానాశ్రయంలోని పార్కింగ్ ప్రాంతంలో 2 ఇందిరా క్యాంటీన్‌లను ప్రారంభించాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు.
తాజావార్తలు
-
Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
-
Dragon : రామోజీఫిల్మ్ సిటీలో వేటకు టైగర్ రెడీ..14 నుండి షూటింగ్లో అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
New Bajaj Pulsar NS125 Leak: కొత్త Bajaj Pulsar NS125 ఫస్ట్ లుక్.. LCD డిస్‌ప్లే, USB-C ఛార్జింగ్‌తో కొత్త ఫీచర్లు!
-
Aafiya Sayed : టాలీవుడ్లోకి బాలీవుడ్ యంగ్ బ్యూటీ ఇంట్రడ్యూస్
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!