Marri Janardhan Reddy Warns Telangana Police: తెలంగాణ పోలీసులపై నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. పోలీసులు సీఎం రేవంత్ రెడ్డికి బానిస అయ్యారని విమర్శించారు. సీఎం గురించి సోషల్ మీడియాలో ఎవరు మాట్లాడినా.. ఉదయనే వారి ఇంటి ముందు పోలీసులు ఉంటున్నారని ఎద్దేవా చేశారు. కందనూలు ప్రాంతంలో పనిచేసిన ప్రతి ఎస్సై, సీఐ, డీఎస్పీల పేరు రాసి పెట్టుకుంటాము అని హెచ్చరించారు. తమ కార్యకర్తలను ఇబ్బంది పెట్టే పోలీసులు భూమి మీద ఉన్నా, ఆకాశంలో ఉన్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదని వార్నింగ్ ఇచ్చారు. అచ్చంపేట నియోజకవర్గం బల్మూర్ మండల బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో మర్రి జనార్దన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.
‘పోలీసులు రేవంత్ రెడ్డికి బానిస అయ్యారు. ముఖ్యమంత్రి గురించి సోషల్ మీడియాలో ఎవరు మాట్లాడినా ఉదయనే వారి ఇంటి ముందు పోలీసులు ఉంటున్నారు. పోలీసు సోదరులను హెచ్చరిస్తున్నా.. కందనూలు ప్రాంతంలో పనిచేసిన ప్రతి ఎస్సై, సీఐ, డీఎస్పీల పేరు రాసి పెట్టుకుంటాము. మా కార్యకర్తలను ఇబ్బంది పెట్టే పోలీసులు భూమి మీద ఉన్నా, ఆకాశంలో ఉన్నావదిలిపెట్టే ప్రసక్తే లేదు. పోలీసులకు హెచ్చరిస్తున్నా.. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కల, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాలేడు. రాష్ట్రంలో రాబోయే 20 ఏళ్ల వరకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి ఉండదు’ అని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు.
Also Read: Bhadrachalam Flood Update: శాంతిస్తున్న గోదావరి.. భద్రాచలం వద్ద 49 అడుగుల నీటిమట్టం!
‘పోలీసు సోదరులారా.. అనవసరంగా కాంగ్రెస్ నేతల మాటలు నమ్మి మీ భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చుకోకండి. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి విరుద్ధంగా కాంగ్రెస్ కార్యకర్తలుగా పోలీసులు పని చేస్తున్నారు. పోలీసులు తస్మాత్ జాగ్రత్త.. నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నా. న్యాయం ఎటు వైపు ఉంటే అటువైపు మీరు ఉండాలి. అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో మాకు స్వేచ్ఛ లేదా?. ఈ ప్రజాస్వామ్యంలో ఎవరు ఎవరి గురించైనా అసభ్యంగా మాట్లాడకుండా ఏదైనా మాట్లాడొచ్చు’ అని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అని హెచ్చరించారు.