బీఆర్ఎస్ పార్టీకి మరో భారీ షాక్ తగిలింది. నిన్ననే మాజీ ఎంపీ సీతారాం నాయక్ బీఆర్ఎస్‌ను వీడుతున్న అని ప్రకటించిన మరునాడు ఉమ్మడి వరంగల్ డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు, ఆయన సతీమణి ఐనవోలు ఎంపీపీ మధుమతిలు బీఆర్ఎస్ వీడి మరికొద్దిసేపటి క్రితం కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ప్రభుత్వ సలహాదారు, మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డి సంక్షేమ లో రవీందర్ రావు, మధుమతి దంపతులు.. కాంగ్రెస్ పార్టీలో చేరారు. మాజీ సీఎం కేసీఅర్ కుటుంబానికి సన్నిహితుడు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రధాన అనుచరుడిగా ఉన్న మార్నేని ఎన్నికల అనంతరం నాటి నుంచి పార్టీ మారుతాడన్న ప్రచారం విస్తృతంగా జరుగుతోంది.
Gaami : అదరగొట్టిన విశ్వక్ మూవీ..’గామి’ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతో తెలుసా?
ఈ నేపథ్యంలోనే ఆయన బీఆర్ఎస్ పార్టీకి అంటి ముట్టనట్లుగానే ఉంటూ వస్తున్నారు. పలుమార్లు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే హరీష్‌రావులు మార్నేనితో చర్చలు జరిపినా ఆయన కాంగ్రెస్ లో చేరడం చర్చనీయాంశం గా మారింది.. ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి వరుసగా బీఆర్ఎస్ నేతలు పార్టీ వేయడం బీఆర్ఎస్ ను వరుస షాక్‌లు కలవరపెడుతున్నాయి.
IND vs ENG: తిప్పేసిన అశ్విన్.. ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో భారత్ విజయం! సిరీస్ 4-1తో సొంతం