Maoist Party: మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ(డీకేఎస్‌జడ్‌సీ) కార్యదర్శి వికల్ప్ పేరుతో మరో సంచలన లేఖ విడుదల చేసింది. ఇటీవల పోలీసులు హిడ్మాను ఎన్‌కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. హిడ్మా ఆచూకీ గురించి దేవ్‌జీ పోలీసులకు చెప్పి ఉంటారనే వార్తలు పార్టీ ఖండించింది. "దేవ్ జీతో పాటు మళ్ళా రాజిరెడ్డి మాతోనే ఉన్నారు.. లొంగిపోవటానికి వారు ఎలాంటి ఒప్పందము కుదుర్చుకోలేదు.. హిడ్మా సమాచారాన్ని దేవ్ జీ పోలీసులకు చెప్పాడు అనేది పూర్తిగా అవాస్తవం..
Hidma Encounter: మావోయిస్టు అగ్ర నేతల్లో ఒకరైన హిడ్మా ఎన్‌కౌంటర్ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా చర్చగా మారింది.. అయితే, హిడ్మా ఎన్‌కౌంటర్‌పై అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.. హిడ్మా ఎన్‌కౌంటర్‌పై విచారణ కోరుతూ NHRCకి ఫిర్యాదు చేశారు.. మావోయిస్టు నాయకుడు హిడ్మా ఎన్‌కౌంటర్‌పై అనుమానాలు వ్యక్తం చేస్తూ న్యాయవాది కె. విజయ్ కిరణ్.. జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC)ను ఆశ్రయించారు. ఎన్‌కౌంటర్ ఫేక్ అయ్యి ఉండే అవకాశంపై సమగ్ర దర్యాప్తు జరపాలని ఆయన డిమాండ్…