NTV Telugu Site icon

Bengaluru School Threat: బెంగళూరులో 15 స్కూల్స్ కు బాంబు బెదిరింపు

Bengalure

Bengalure

కర్ణాటక రాజధాని బెంగళూరులోని దాదాపు 15 పాఠశాలలకు ఇవాళ ఉదయం బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పాఠశాలలన్నింటిని ఖాళీ చేయాలని పోలీసులు తెలిపారు. ఉద్దేశ్యపూర్వకంగానే ఎవరైనా ఇలాంటి మెయిల్ పంపించారా అని అనుమానిస్తున్నారు. ఆ 15 స్కూల్లలో బాంబ్ స్క్వాడ్ బృందాలు విచారణ చేస్తున్నాయి. అయితే, విషయం తెలుసుకున్న డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పలు పాఠశాలలను సందర్శించారు.

Read Also: New SIM Card: నేటి నుంచి మారుతున్న సిమ్ కార్డ్ రూల్స్.. అలా చేస్తే రూ.10 లక్షల జరిమానా..!

విద్యార్థుల తల్లితండ్రులు ఆందోళన చెందొద్దని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వెల్లడించారు. కొందరు దుర్మార్గులు ఇలా చేసి ఉండవచ్చని.. 24 గంటల్లో వారిని పట్టుకుంటామని ఆయన తెలిపారు. సైబర్ క్రైమ్ పోలీసులు వారిని ట్రేస్ చేసే పనిలో ఉన్నారు.. మనం కూడా అప్రమత్తంగా ఉండాలి అని సూచించారు. ఈ వార్తలపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సైతం స్పందించారు. పాఠశాలలను తనిఖీ చేసి భద్రత పెంచాలని పోలీసులను ఆదేశించాను అని ఆయన చెప్పారు. పోలీసు శాఖ నుండి ప్రాథమిక నివేదిక అందింది.. ఈ మెయిల్ గురించి పాఠశాల అధికారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.. ఆ తర్వాత పోలీసులు బాంబు డిస్పోజల్ స్క్వాడ్‌లు, దర్యాప్తు బృందాలు సోదాలు చేశాయని చెప్పారు.

Read Also: Narendra Modi: దుబాయ్‌లో మోడీ.. 21 గంటలు ఇక అక్కడే.. ఏ ఏ కార్యక్రమాల్లో పాల్గొంటారంటే..?

అయితే, పోలీసుల విచారణలో ఇది ఫేక్ మెసేజ్ అని తేలింది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు.. మా బృందాలు బాగా పని చేస్తున్నాయని పోలీసులు తెలిపారు. గతేడాది కూడా బెంగళూరులోని పాఠశాలల్లో బాంబు ఉందంటూ బెదిరింపులు వచ్చాయి.. ఇలాంటి మెయిల్స్‌ పట్ల అలర్ట్ గా ఉండాలి.. వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని బెంగళూరు పోలీసులు చెప్పారు.