తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు కీలక ప్రకటన చేశారు.. తిరుపతి నగరవాసులకు.. శ్రీవారి భక్తులకు ఎలాంటి భయాలు అవసరం లేదన్నారు.. బాంబు బెదిరింపులపై ప్రత్యేక సైబర్ టీం, ఐటీ, సహా ఇతర విభాగాలతో దర్యాప్తును వేగంగా చేస్తున్నాం అన్నారు.. నగరంలో భద్రత పెంచాం.. నిరంతరం సీసీటీవీ పర్యవేక్షణలో ప్రతి ఒక్కరి కదలికను మానిటరింగ్ చేస్తున్నాం.. బెదిరింపులు వచ్చిన అన్ని హోటల్లో సహా ఇతర ప్రదేశాలలో పూర్తిస్థాయి తనిఖీలు చేపట్టాం.. ఇప్పటివరకు ఎలాంటి అనుమానాస్పద వస్తువులు తనిఖీల్లో దొరకలేదు…
టెంపుల్ సిటీ తిరుపతిలో వరుసగా బాంబు బెదిరింపులు కలకలం సృష్టిస్తున్నాయి.. నగరంలోని అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజ్ పార్క్, పాయ్ వైస్రాయ్ హోటల్ సహా మరో రెండు ప్రాంతాలకు తాజాగా బాంబు బెదిరింపులు వచ్చాయి.. దీంతో.. అప్రమత్తమైన పోలీసులు.. డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు చేపట్టారు..
Bomb Threat Emails : బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (BMC) లోని ప్రముఖ ఆసుపత్రులు, కళాశాలలతో సహా ముంబై(Mumbai) లోని 60కి పైగా సంస్థలకు బాంబు పేలుళ్ల బెదిరింపు ఇమెయిల్‌లు వచ్చాయని, ఆ తర్వాత వాటిలో అనుమానాస్పదంగా ఏమీ కనుగొనబడనప్పటికీ సోదాలు నిర్వహించినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఈ విషయం గురించి సోమ, మంగళవారాల్లో ఒకే మెయిల్ ఐడీ నుంచి ఈమెయిల్స్ వచ్చాయని తెలిపారు. Raai Laxmi : చేతిలో వైన్ గ్లాస్ తో రత్తాలు..బికినీ…
దేశ వ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో బాంబు బెదిరింపు కాల్స్ కలకలం రేపుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పటికే స్కూళ్లు, హాస్పటల్స్, ఎయిర్‌పోర్టు, కేంద్ర హోంశాఖకు కూడా ఈ మెయిల్ ద్వారా బెదిరింపు కాల్స్ వచ్చాయి.
కర్ణాటక రాజధాని బెంగళూరులోని దాదాపు 15 పాఠశాలలకు ఇవాళ ఉదయం బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పాఠశాలలన్నింటిని ఖాళీ చేయాలని పోలీసులు తెలిపారు.